ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సిబిఐ కోర్టు లో ఊరట లభిస్తుందా ? లేదా ?? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది . ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో   వ్యక్తిగత హాజరు నుంచి జగన్ మోహన్ రెడ్డి కి మినహాయింపునివ్వాలని కోరుతూ , అయన తరుపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే . ముఖ్యమంత్రి హోదా లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి పరిపాలనాపరమైన పనుల్లో బిజీగా ఉంటారని , ప్రతి వారం కోర్టుకు హాజరు కావడం వల్ల పరిపాలనాపరమైన పనులకు ఇబ్బంది కలుగుతుందని , అందుకే ప్రతివారం కోర్టు కు హాజరు నుంచి  ఆయనకు మినహాయింపునివ్వాలని కోర్టుకు విన్నవించారు .


అయితే జగన్ మోహన్ రెడ్డి న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ కు సిబిఐ అధికారులు  కౌంటర్ దాఖలు చేశారు .  జగన్ మోహన్ రెడ్డి కి ఎట్టి పరిస్థితుల్లో కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని కోరారు . జగన్ మోహన్ రెడ్డి గతం లో అరెస్టు అయి జైల్లో ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని ... అప్పుడు ఆయన కేవలం ఎంపీ మాత్రమేనని , ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం వల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు . సిబిఐ అధికారుల కౌంటర్ నేపధ్యం లో కోర్టు లో ఇరువురు తమ వాదనలను బలంగా విన్పించే అవకాశాలు లేకపోలేదు .


అయితే సిబిఐ కోర్టు ఏమి నిర్ణయిస్తుందన్న దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది . ప్రధాన  ప్రతిపక్ష నేత  హోదా లో జగన్ మోహన్ రెడ్డి ప్రతి వారం కోర్టుకు హాజరయిన విషయం తెల్సిందే . పాదయాత్ర సందర్బంగా మినహాయింపు ఇవ్వాలని కోరిన అంగీకరించని సిబిఐ కోర్టు , రేపు ఎటువంటి తీర్పునిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది .  

మరింత సమాచారం తెలుసుకోండి: