గత 70 సంవత్సరాల నుంచి రగులుతున్న అయోధ్య  రగడ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. అయితే గత 70 ఏళ్ళనుంచి సుప్రీంకోర్టు ఎన్నోసార్లు ఈ కేసు వివాదం పరిష్కరించేందుకు ప్రయత్నించినా  విఫలం అయ్యారు. అయితే అయోధ్యలో రామమందిర నిర్మాణం చేయాలా  లేక బాబ్రీ మసీదు నిర్మించాలా  అనే దానిపై హిందువులు ముస్లింలు మధ్య భేదాభిప్రాయాలు కారణంగా ఈ వివాదం మొదలైంది. అయితే బుధవారం ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ వివాదం పై తీర్పును రిజర్వులో ఉంచింది. అయితే ఈ వివాదం బాబ్రీ మసీదు రామ మందిరం గురించి కాదని ఇరువర్గాల మనోభావాలకు చెందిందని సుప్రీంకోర్టు తెలియజేసింది. కగా  సుప్రీంకోర్టు నేడు అయోధ్య వివాదం పై తుది తీర్పును వెలువరించనుంది . 

 

 

 

 అయితే ఈ తీర్పుపై దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా అయోధ్య వివాదం పై ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడు అయోధ్యలోనే  జన్మించాడు. ఈ విషయం ముస్లింలతో పాటు ప్రపంచం మొత్తానికి తెలుసు అని బాబా రాందేవ్ అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బాబా రాందేవ్... అయోధ్య వివాదం తుది దశకు వచ్చేసినట్టే అని ఆయన తెలిపారు. ఇక అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సి ఉందని బాబా రాందేవ్ డిమాండ్ చేశారు. అయోధ్యలో రామమందిరం బార్బీ మసీద్ వివాదంపై దేశం మొత్తం ఆశక్తిగా ఎదురు చూస్తోందని బాబా రాందేవ్ అన్నారు. 

 

 

 

 అయితే ఈ సందర్భంగా ఆర్టికల్ 370  రద్దుపై కూడా బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మోదీ బిజెపి అధ్యక్షుడు అమిత్ షా లు కలిసి ఒకే దేశం,  ఒకే రాజ్యం, ఒకే జెండా కల నెరవేర్చారని ఆయన అన్నారు. సర్దార్ పటేల్ తర్వాత ఇన్నేళ్లకి ఆ పని చేసింది మోడి అమిత్ షా  లేనని కొనియాడారు. ఈ ఒక్క  కీలక నిర్ణయంతో కేంద్రంపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని... ప్రజలు కేంద్రాన్ని నమ్ముతున్నారని అన్నారు. ఈ సందర్భంగా దేశంలో ఏర్పడిన ఆర్థిక మందగమనం గురించి మాట్లాడిన  రాందేవ్ బాబా... ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆర్థిక మందగమనం ఏర్పడిందని తెలిపారు. అయితే భారతదేశంలో ఏర్పడిన ఆర్థిక మందగమానాన్ని మోడీ  సమర్థవంతంగా పరిష్కరిస్తారని  బాబా రాందేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: