ప్రయివేటు ఆపరేటర్లు, సీఎంకు మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్‌ జరిగిందని ప్రజాపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు జఠిలంగా తయారవుతుంది. అయినా సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో ప్రతిపక్షాలు ముఖ్యంగా వామపక్షాలు పెద్ద ఎత్తున సీఎం వైఖరిని దుయ్యపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే  అందుకే సమ్మె జరుగుతున్నా అద్దె బస్సులకు నోటిఫికేషన్‌ ఇచ్చారని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రయివేటు బస్సులు 50 శాతం ఉంటాయని సీఎం కేసీఆర్‌ బాహాటంగా ప్రకటించారని మండిపడుతున్నాయి. 


ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  వైఖరి, అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. అంతేకాకుండా కేసీఆర్ అనుసరిస్తున్న భూస్వామ్య ఆలోచన విధానాలు ప్రమాదకరమని వ్యాఖ్యానించడం గమనార్హం. తెలంగాణ సమాజం బస్సుల్లేక ఇబ్బందులు పడుతున్నా సమ్మెను ఎవరూ విమర్శించడం లేదని చెప్పారు. పోలీసులు కూడా సమ్మె న్యాయమైనదే అంటున్నారని వ్యాఖ్యానించారు. సీఎం మొండి వైఖరి వల్ల చీకటి రోజులు వస్తున్నాయని ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతోంది.






ఇదిలా ఉండగా తాము చేపట్టిన సమ్మె విషయంలో ప్రభుత్వం ముందుకు రాకపోతే రాజ్యాంగ సంక్షోభం కూడా రావచ్చని కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నో త్యాగాలు ,ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇప్పటికైన సీఎం కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని సిఎంకి ఆయన హితవు చెప్పారు. హైకోర్టు ఆదేశించిన విధంగా తాము సమ్మె విషయంలో చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎలా సాధ్యమో చర్చల్లోనే చెబుతామని అశ్వత్థామరెడ్డి పేర్కొంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో  తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: