ఈనెల 21న హుజూర్నగర్ లో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఉప ఎన్నికలను అటు కాంగ్రెస్ ఇటు టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి . గతంలో స్వల్ప తేడాతో ఓడిపోయిన టిఆర్ఎస్ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని సర్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ప్రచారం లో దూసుకుపోతుంది  టీఆర్ఎస్. అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో దెబ్బ మీద దెబ్బ పడుతుంది టిఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే... ఇప్పటికే ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ తో ప్రజల్లో టిఆర్ఎస్ పై  కాస్త నెగటివ్ ఇంప్రెషన్ పడింది. ఇక టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన సిపిఐ కూడా మద్దతు ఉపసంహరించుకోవడంతో  టిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలినట్లయింది. 

 

 

 

 ఈ నేపథ్యంలో హుజూర్నగర్ లో ఎలాగైనా విజయాన్ని నమోదు చేయాలని అనుకుంటున్న టిఆర్ఎస్... ప్రచార జోరు పెంచింది టిఆర్ఎస్. ఈ నేపథ్యంలో నిన్న హుజూర్నగర్ లో టిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రచారం నిర్వహించేందుకు నిర్ణయించారు. కాని  భారీ వర్షం కారణంగా  కెసిఆర్ సభకు హాజరు కాలేదు. దింతో సభ రద్దయింది. అయితే కెసిఆర్ హుజూర్నగర్ సభకు హాజరు కాకపోవడంపై  ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

 

 

 

 అయితే తాజాగా టిఆర్ఎస్ నేత విజయశాంతి కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేసారు . కెసిఆర్ హుజూర్నగర్ లో తలపెట్టిన బహిరంగ సభకు వెళ్లక పోవడానికి వర్షం కారణం కాదని... అక్కడికి వెళ్లాక ఎక్కడ ఆర్టీసీ సమ్మె సెగ తగులుతుందోనని  భయంతోనే హుజూర్నగర్ వెళ్లలేదని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు.సభ  మధ్యలో ఎవరైనా ఆర్టీసీ కార్మికులు కెసిఆర్ ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారని ముందుగానే గ్రహించిన కేసీఆర్... సభ కి వెళ్ళ లేదని విమర్శించారు. ఒకవేళ నిజంగా వర్షం కారణంగానే సభకు వెళ్లకుండా ఉండుంటే... 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుజూర్ నగర్ కు రోడ్డు మార్గంలో కూడా వెళ్లవచ్చని... కానీ ఆర్టీసీ నిరసనల సెగ లు  ఎక్కడ తగ్గులుతాయో అన్న  భయంతోనే సభకు దూరంగా ఉన్నారని విమర్శించారు. హుజూర్నగర్ లో భారీ బహిరంగ సభ రద్దు చేసిన కేసీఆర్ ఒక రకంగా హుజూర్నగర్ లో ఓడిపోయినట్లు లేనని విజయశాంతి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: