గ‌త ఐదేళ్ల కాలంలో మ‌న రాష్ట్రం ప‌క్క రాష్ట్రాన్ని చూసి కాపీకొడుతోంద‌నే వ్యాఖ్య‌లు త‌ర‌చుగా వినిపించే వి., అక్క‌డి కేసీఆర్ ప్ర‌బుత్వం ఏ కార్య‌క్ర‌మం అమ‌లు చేస్తే.. ఇక్క‌డ కూడా పేరు మార్చి అదే కార్య‌క్ర‌మం అమ‌ల‌య్యేది. ఇక‌, ఇప్పుడు ప్ర‌భుత్వం మారింది. మ‌న‌ల్ని చూసి.. కేసీఆర్ ప్ర‌బుత్వం ఉడికిపోతోంది. ఆర్టీసీ విలీనం నుంచి ఉద్యోగాల భ‌ర్తీ వ‌ర‌కు నాణ్య‌మైన బియ్యం నుంచి మ‌ద్య నిషేధం లేదా కంట్రోల్ వ‌ర‌కు కూడా కేసీఆర్ ప్ర‌భుత్వం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. అక్క‌డి ప్ర‌జ‌లు జ‌గ‌న్ పాల‌న‌ను చూపిస్తూ.. మీరు కూడా ఇలా ఎందుకు చేయ‌కూడ‌దు అంటున్నారు.


దీంతో కేసీఆర్ టీంకు ఒకింత ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణం ఎదుర‌వుతోంది. నిజానికి గ‌డిచిన  ఐదేళ్ల కాలంలో కేసీఆర్ గ‌ర్వంగా.. మ‌న ప‌థ‌కాల‌ను ఏపీ పాల‌కులు కాపీ కొడుతున్నార‌ని ఏ వేదిక ఎక్కినా చెప్పుకొనే వారు. ఈ క్ర‌మంలోనే క‌ళ్యాణ ల‌క్ష్మి, అన్న‌దాత సుఖీభ‌వ, మంత్రి వ‌ర్గంలో చంద్ర‌బాబు త‌న కుమారుడిని తీసుకుని ప‌ద‌వులు ఇవ్వ‌డం ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లు చాలానే ఉన్నాయి. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మొత్తం రివ‌ర్స్ అయింది. ఏపీలో యువ సీఎం జ‌గ‌న్‌.. త‌న‌దైనశైలిలో దూసుకుపోతున్నారు. త‌న పాల‌న‌లో ప్ర‌జ‌లకు అన్ని ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందాల‌ని నిర్ణ‌యించుకుని అనేక కార్య‌క్ర‌మాల‌ను వెలుగులోకి తెచ్చారు.


దీనిలో భాగంగానే వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను దేశంలో ఏరాష్ట్రంలోనూ లేని విధంగా అమ‌లు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో కేంద్రం అమలు చేస్తున్న ప‌థ‌కాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం పెట్టిన పేరునే పెడుతున్నారు. త‌ను ఆ ప‌థ‌కాన్ని మ‌రింత మ‌న్నిక‌గా ప్ర‌జ‌ల‌కు చేర‌వేస్తున్నా.. త‌ను మ‌రింత సొమ్మును జ‌త చేస్తున్నా.. కూడా జ‌గ‌న్ ఎక్క‌డా కేంద్ర ప‌థ‌కాన్ని త‌న‌దిగా చెప్పుకోవ‌డం లేదు. ఈ త‌ర‌హా ప‌రిస్థితి కేసీఆర్‌కు ఇబ్బందిగా మారింద‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేస‌మ‌యంలో మంత్రి వ‌ర్గంలోకి మ‌హిళ‌ల‌ను తీసుకుని, వారికి ఎన‌లేని ప్రాధాన్యం పెంచారు. ఇది జ‌రిగిన త‌ర్వాతే.. కేసీఆర్ త‌న మంత్రి వ‌ర్గంలోకి మ‌హిళ‌ల‌ను తీసుకున్నారు.


ఇక‌, అటు ఎన్నిక‌ల‌కు ముందు కానీ, త‌ర్వాత కానీ .. ఆర్టీసీ కార్మికుల‌కు జ‌గ‌న్ ఎలాంటి హామీ కూడా ఇవ్వ‌లేదు.కానీ, తాను అదికారంలోకి రాగానే ఆర్టీసీని ప్ర‌భుత్వంలో క‌లిపేందుకు సంచ‌ల‌నం నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌, ఈ విష‌యంలో కేసీఆర్ చాలా వెనుక‌బ‌డి పోయారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆయ‌న విలీన ప్ర‌క‌ట‌న చేసి, ఇప్పుడు వెన‌క్కి త‌గ్గారు. దీంతో గ‌డిచిన 13 రోజులుగా తెలంగాణ‌లో ఆర్టీ సీ కార్మికులు కదం తొక్కుతున్నారు. ఇలా ఎలా చూసుకున్నా.. తెలంగాణ‌-ఏపీ ప్ర‌భుత్వాల మ‌ధ్య సీన్ రివ‌ర్స్ అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మున్ముందు ఇంకెన్ని ప‌రిణామాలు తెర‌మీదికి వ‌స్తాయో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: