ఆయన నోరు విప్పితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. తన సాటి నాయకులు దేశంలొనే లేరని కూడా చెబుతారు. ఓ వైపు అద్వాని లాంటి దిగ్గజం ఉన్నా,  పక్కనే కన్నడ దెవేగౌడా ఉన్నా కూడా బాబు మాత్రం నేనే సీనియర్ అని చెప్పుకునేందుకు ఎక్కడా వెరవరు. అయిదేళ్ల క్రితం మళ్లీ సీఎం  సీటు దక్కగానే బాబుతో అతిశయం బాగా పెరిగిపోయిందటారు. ఐతే ఇపుడు ఆయన విపక్షంలోకి వచ్చేశారు. దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్నారు. దీంతో ఆయన పరిస్థీతి ఏంటి అంటే...


తోక పార్టీగా చెప్పుకునే బీజేపీకి కూడా  బాబు చులకన అయిపోయారు. అలా ఇలా కాదు, ఏకంగా  బాబునే తీసిపారేస్తోంది కమలం పార్టీ. ఏపీ ఇంచార్జిగా వచ్చిన సునిల్ డియేధర్ చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే తమ్ముళ్ళకు మంట పుడుతున్నాయట. చంద్రబాబును జనం నమ్మరు. ఆయన శకం ముగిసిపోయిందంటూ సునీల్ చేస్తున్న హాట్ కామెంట్స్ చూసి తమ్ముళ్ళు మండిపోతున్నారు. ఏపీలో బీజేపీకి ఉన్న స్కోప్ ఏంటి, ప్లేస్ ఏంటి అని కూడా తగులుకుంటున్నారు.


ఏపీలో చూసుకుంటే ఇప్పటికీ వైసీపీ, టీడీపీలే పెద్ద పార్టీలు, తమిళనాడు మాదిరిగా రెండు ప్రాంతీయ పార్టీల కల్చ‌ర్ ఇక్కడ కూడా వచ్చేసింది. జాతీయ పార్టీల సీన్ కాలిందన్న సంగతి 2014 ఎన్నికలు రుజువు చేశాయి. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా నోటా కంటే కూడా దారుణంగా ఓట్లు తెచ్చుకుని చతికిలపడ్డాయి. కేంద్రంలో అధికారం ఉండడంతో బీజేపీ మెరుస్తోంది తప్ప లేకపోతే కాంగ్రెస్ పక్కనే ప్లేస్ అన్న వారూ లేకపోలేదు. మరి ఇంతోటి దానికి ఏపీ బీజేపీ ఇంచార్జి టీడీపీ పని అయిపోయిందని బడాయి కబుర్లు చెబుతున్నారని పసుపు తమ్ముళ్ళు విసుక్కుంటున్నారు.


నిజానికి చంద్రబాబు మీద జనాలకు నమ్మకం లేక ఓడించారు. ఆయన్ని దారుణ పరాభవానికి గురి చేసారు. అది సరే కానీ బీజేపీ సంగతేంటి. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీకి ఏపీలో ఉన్న 175 సీట్లో కనీసం బలమైన నాయకులు ప్రతీ సీట్లో ఒక్కరైనా ఉన్నారా అన్నది ప్రశ్న అంటున్నారు తమ్ముళ్ళు. ఓడినా కూడా వైసీపీకి టీడీపీయే పోటీ అంటున్న తమ్ముళ్ళు బీజేపీ చేస్తున్న దారుణమైన ప్రకటనలకు కక్కలేక మింగలేక‌ అన్నట్లుగా ఉన్నారట. ఎందుకంటే మళ్లీ అదే బీజేపీతో చేతులు కలపాలని బాబుగారు చూస్తూండడమే. దాంతో మరింత చులకన అయిన బాబుని కమలనాధులు దారుణంగా వేసుకుంటున్నారు. మొత్తానికి బాబు ఓడిపోవడం కాదు కానీ మరీ ఇంత చులకన అయ్యారా అన్న కామెంట్స్ పడిపోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: