అన్న గారి పెద్దల్లుడుగా రాజకీయ రంగప్రవేశం చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు పెద్దాయన బతికి ఉన్నంతవరకూ బాగానే హవా చలాయించారు. ఎపుడైతే టీడీపీ చీలిపోయి చిన్నల్లుడు చంద్రబాబు పరం టీడీపీ  అయిందో నాటి నుంచి దగ్గుబాటి రాజకీయ ప్రభ అలా తగ్గిపోతూ వచ్చింది. ఆయన మారని పార్టీ లేదు అంటారు కానీ, ఆయన మారినా కూడా దక్కింది ఏదీ లేదని అనుచరులు ఆవేదన‌ చెందుతారు.


ఇక కాంగ్రెస్ ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన అన్న గారి పెద్ద కుమార్తె పురందేశ్వరి అలియాస్ చిన్నమ్మ రెండు మార్లు విశాఖ నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా అధికారం చలాయించారు. విభజన తరువాత ఆమె బీజేపీలో చేరి అయిదేళ్ల పాటు కాషాయం నీడన ఉన్నా కూడా తగిన గుర్తింపు లేదని మధనపడుతున్నారట. విశాఖ నుంచి ఎంపీగా 2019 ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ సైతం పోగొట్టుకున్న చిన్నమ్మ‌కు రాజ్యసభ సీటు ఇస్తారన్న ఆశ ఎక్కడో ఉండేది. అయితే టీడీపీ నుంచి సుజనా చౌదరి వచ్చి బీజేపీలో చేరడంతో ఆ ఆశ గల్లంతు అయిందని అంటున్నారు. ఇక మళ్లీ రాజకీయ వైభోగం దక్కుతుందా అన్న డౌట్లో చిన్నమ్మ పొలిటికల్  కెరీర్ ఉందట. అందుకే ఆమె సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారని అంటున్నారు.


ఇక దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరినా కూడా లక్ కలసిరాలేదు జగన్ వేవ్ ఉన్నా కూడా ఆయన పరుచూరు నుంచి  పోటీ చేసి కూడా ఓడిపోయారు. దాంతో జగన్ సైతం పట్టించుకోవడంలేదు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండాలని జగన్ చెప్పినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలతో ఏం చేయాలో తోచక దగ్గుబాటి హైదరాబాద్ లోనే ఉండిపోతున్నారని అంటున్నారు. మొత్తానికి దగ్గుబాటి దంపతుల పొలిటికల్ కెరీర్ కి డెడ్ ఎండ్ పడిపోయిందా అన్న  డౌట్లు వస్తున్నాయి. చూడాలి మరి ఈ సైలెంట్ వెనక ఏదైనా వ్యూహం వుందేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: