వైఎస్ జగన్ పై గతంలో పలు కేసులు ఉన్న సంగతి తెలిసిందే.  ఈ కేసుల్లో జగన్ ఏ 1 గా ఉన్న కారణంగా అప్పట్లో ప్రతి శుక్రవారం రోజున హైదరాబాద్ లోని సిబిఐ కోర్టుకు  హాజరు కావాల్సి ఉన్నది.  అయితే, జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత పరిపాలనపై దృష్టి పెట్టారు.  దీంతో సమయం దొరకడం లేదు.  వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడానికి కుదరడం లేదని, వ్యక్తిగతంగా హాజరు కావడంపై మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కొన్ని రోజుల క్రితం కోర్టులో జగన్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.  


అయితే, సిబిఐ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది.  వ్యక్తిగతంగా మినహాయింపు ఇవ్వొద్దని సిబిఐ కోర్టుకు విన్నవించింది.   వైఎస్ జగన్ గతంలో అరెస్టై జైలులో ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని, అప్పట్లో ఆయన కేవలం ఎంపీ మాత్రమేనని, ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు కాబట్టి సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీబీఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నేడు రెండు పక్షాలూ బలమైన వాదనలు వినిపించే అవకాశాలున్నాయి . 


దీనిపై కోర్టు ఎలాంటి  డెసిషన్ తీసుకుంటుందో చూడాలి.  కోర్టు తీసుకునే నిర్ణయం బట్టి జగన్ కోర్టుకు హాజరు కావాలా వద్దా అని తేలిపోతుంది.  ప్రస్తుతం జగన్ తీరికలేకుండా ఉన్నారు.  పరిపాలన విషయంలో చురుగ్గా పనిచేస్తున్నారు.  ప్రజలకు ఉపయోగపడే పధకాలను పవేశపెడుతూ.. ప్రజల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారు.  ప్రజా రంజకమైన పరిపాలన చేస్తున్నారు.  నిరుద్యోగుల విషయంలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇల్లు లేని పేదలకు భూమిని ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.  అంతేకాదు, రైతు భరోసా కిందా ప్రతి రైతుకు 13,500 రూపాయలు ఇస్తున్నారు.  ఆటో డ్రైవర్లకు 10వేలరూపాయలు ఇచ్చి ఆదుకున్నారు.  ఇలా ఎన్నో పధకాలను ప్రవేశపడుతున్నారు జగన్.    


మరింత సమాచారం తెలుసుకోండి: