ప‌వ‌ర్‌స్టార్, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ దారి ఎటో తేలిపోయే స‌మ‌యం ఆస‌న్న‌మైందా..? అస‌లు ప‌వ‌న్ ఏమీ నిర్ణ‌యం తీసుకోనున్నారు..?  అస‌లు రాజ‌కీయాల్లో పూర్తిస్థాయిలో కొన‌సాగుతారా..?  లేక త‌న బ్ర‌ద‌ర్ బాట‌లోనే న‌డుస్తారా..?  ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో త‌న‌దైన మార్క్‌తో ముందుకు సాగుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌య‌న‌మెటో..?  వీటికి స‌మాధానం తెలియాలంటే ఈ రోజు సాయంత్రం వ‌ర‌కు ఆగాల్సిందేనా..?  ఇంత‌కు సాయంత్రం దాకా ఆగాల్సిన ప‌నేముంది.. అనుకుంటున్నారా..? ఈ ఒక్క రోజులోనే ఆయ‌న భవిష్య‌త్ ఏమిటో నిర్ధార‌ణ కానున్న‌దా..? అంటే అవున‌నే అంటున్నారు. రాజ‌కీయ ప‌రిశీల‌కులు.


ఇంత‌కు ఈ రోజు ఏమీ జ‌రుగ‌బోతుందో ఓసారి చూద్దాం... గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఓటమి తరువాత ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. పార్టీలోకి రాష్ట్ర‌స్థాయిలో చ‌క్రం తిప్పిన నేత‌లు, ఎమ్మెల్యే అభ్య‌ర్థులుగా పోటీ చేసి ఓడిపోయినవారు, ద్వితీయ శ్రేణి నాయ‌కులు, గ్రామ స్థాయి లోని కార్య‌క‌ర్త‌లు కూడా అటు బీజేపీ ఇటు వైసీపీలో చేరిపోతున్నారు. అయితే వైసీపీ నేతృత్వంలో సీఎంగా జ‌గ‌న్  కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన త‌రువాత  100 రోజుల వరకు ప్ర‌భుత్వంపైనా, నాయ‌కుల‌పైనా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని చెప్పిన పవన్ కళ్యాణ్ 100 రోజుల తరువాత జగన్ పాలనకు సంబంధించిన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.


ఇక వ‌రుస‌బెట్టి సంద‌ర్భంగా దొరికిన‌ప్పుడ‌ల్లా మాజీ సీఎం, ప్ర‌స్తుత ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడిని మించి జ‌గ‌న్ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అంతే కాదు స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా ఈటెల్లాంటి మాటలు సంధిస్తూ, టీడీపీ క‌న్నా జ‌న‌సేనే ప్ర‌తిప‌క్షంగా అనిపించేలా ప‌నిచేస్తున్నారు. ఓవైపు ఆరోప‌ణలు చేస్తూనే పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అనారోగ్యం వెంటాడుతుంది. దీంతో పవన్ కళ్యాణ్ ట్రీట్మెంట్ కోసం కేరళ వెళ్లారు. అక్క‌డ కొంత‌కాలం వైధ్యం చేయించుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు పూర్తిస్థాయిలో రాజ‌కీయాలు చేస్తూనే ఉన్నారు. గంగా ప్రక్షాళ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.


అయితే, పవన్ కళ్యాణ్ ను సినిమా రంగంలోకి తిరిగి తీసుకురావడానికి కొంతమంది దర్శకులు, నిర్మాతలు ట్రై చేస్తున్నారు.  పవన్ మాత్రం రాజకీయాల్లోనే ఉంటానని అంటున్నారు.  అయితే, ఇప్పటికే గబ్బర్ సింగ్ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ పవన్ తో త్వరలోనే సినిమా చేస్తానని చెప్పడంతో.. పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతున్నది.  దీనిపై ఈరోజు జరిగే పొలిట్ బ్యూరో సమావేశం జరగబోతున్నది   ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ లోని జనసేన పార్టీ ఆఫీస్ లో ఈ సమావేశం జరగబోతున్నది. తరువాత అక్టోబర్ 20 వ తేదీన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఉంటుంది.  


ఈ రెండింటి తరువాత పవన్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న మెగాస్టార్ చిరంజీవి రాజ‌కీయాల్లో రాణించిన త‌రువాత పార్టీకి ఇక దూర‌మై ఇప్పుడు సినిమాల్లో రెండో ఇన్నింగ్స్ సాగిస్తున్నారు. రెండో ఇన్సింగ్స్‌లో మెగాస్టార్ భారీ సిక్స‌ర్లు కొడుతూనే సెంచరీల మీద సెంచ‌రీలు సాధిస్తూ మంచి ఊపుమీదున్నాడు. అందుకే రాబోవు ఐదేండ్లు జ‌న‌సేన‌ను కాపాడాలంటే ప‌వ‌ర్‌స్టార్ క‌ళ్యాణ్ సినిమాల్లో న‌టిస్తే ఎంతో కొంత డ‌బ్బులు సంపాదించుకోవ‌చ్చు.. అనే ఆలోచ‌న చేస్తున్నార‌ట‌.. అందుకే అటు సినిమాలా.. లేక ఫ‌క్తు రాజ‌కీయ‌మేనా అనేది తేలాల్సి ఉంది... అది ఈరోజు కాకున్నా రెండు మూడు రోజుల్లో క్లారిటీ రానున్న‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: