కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో టమాట రైతుల కష్టాలు తీరటం లేదు. కమీషన్ ఇస్తేనే కొంటామని వ్యాపారులు చెప్పటంతో కొనుగోళ్లు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కమీషన్ లేకుండా టమాట పంట కొనాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. నిన్న ఉదయం నుండి రాత్రి వరకు టమాట రైతులు ధర్నా చేశారు. విషయం అధికారుల దృష్టికి రావటంతో అధికారులు రంగంలోకి దిగి సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. 
 
అధికారులు చెప్పినప్పటికీ సమస్య తీరలేదని తెలుస్తోంది. కమీషన్ ఇస్తేనే టమాట పంట కొంటామని వ్యాపారులు తేల్చి చెబుతున్నట్లు తెలుస్తోంది. కొనుగోళ్లలో ఆలస్యం జరిగితే టమాట పంట కుళ్లిపోయి నష్టం వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 10 రోజుల నుండి పత్తికొండలో ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. మార్కెట్ లోనే రైతులనుండి వ్యాపారులు కొనుగోలు చేయాలని, ఎలాంటి కమీషన్ వసూలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వ్యాపారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
నిన్న అర్ధరాత్రి వరకు రైతుల ఆందోళనలు పత్తికొండలో కొనసాగాయి. వ్యాపారులు స్థానిక రాజకీయనాయకులతో కుమ్మక్కై రైతులకు నష్టం కలిగే విధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా అధికార యంత్రాంగానికి ఈ విషయం తెలిసినా వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. అధికారులు రైతులు, వ్యాపారులతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 
 
పత్తికొండ మార్కెట్ లో భారీ మొత్తంలో టమాట నిల్వలు పేరుకుపోయాయని తెలుస్తోంది. అధికారుల చర్చల తరువాత వ్యాపారులు కొనుగోలు చేసే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం రైతుల నుండి పంట కొనుగోలు చేస్తే ఎంత మొత్తానికి కొనుగోలు చేస్తుందనే విషయం తెలియాల్సి ఉంది. కమీషన్ వసూలు చేయకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ వ్యాపారులు కమీషన్ వసూలు చేస్తేనే టమాటా పంట కొనుగోలు చేస్తామని చెబుతున్నారని, అధికారులు వ్యాపారులపై తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: