కల్కి ఆశ్రమంలో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే నగదు, బంగారంతో పాటు, కొన్ని విలువైన పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే 30 కోట్ల రూపాయల నుండి 40 కోట్ల రూపాయల వరకు అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. వరదయ్యపాళెం కల్కి ఆశ్రమంలో 30 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీని, బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 
 
గతంలో కల్కి ఆశ్రమంలో మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారు అనే ఆరోపణలు వినిపించాయి. ఐటీ అధికారులకు ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఆధారాలు దొరికనట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు తమిళనాడు పోలీసులకు కూడా మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 100 కోట్ల రూపాయలకు ఆదాయపు పన్ను కట్టని కారణంగానే ఐటీ అధికారుల దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 
 
దేశవ్యాప్తంగా ఉన్న కల్కి ఆశ్రమాలలో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో 60 కోట్ల రూపాయల మేర అక్రమాస్తులు ఉన్నాయని, భూములు కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కల్కి ఆశ్రమంలో లేహ్యం రూపంలో  డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 
వందల కోట్ల రూపాయల ఆస్తులు డ్రగ్స్ అమ్మి సంపాదించారనే ఆరోపణలు కూడా స్థానికుల నుండి వినిపిస్తున్నాయి. అనేక రహస్యాలకు కేంద్ర బిందువుగా కల్కి భగవాన్ ఆశ్రమం మారిందని ఆరోపణలు వస్తున్నాయి. ఐటీ అధికారుల దాడులు జరుగుతున్న సమయంలో ఆశ్రమం నుండి కోడ్ లాంగ్వేజ్ లో కొన్ని సందేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సందేశాల గురించి కూడా ఐటీ అధికారులు కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ కోడ్ లాంగ్వేజ్ సందేశాలు విదేశీ కరెన్సీకి సంబంధించినవి కావచ్చని అధికారులు భావిస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: