తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలై  నేటితో 14 రోజుకు చేరుకుంది. అయితే ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉదృతంగా మారుతోంది. ఆర్టీసీ సమ్మె లో టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె లో ఆర్టీసీ ఉద్యోగులు అందరిని చైతన్య పరుస్తూ... తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటం చేయడానికి ప్రతిఒక్క ఆర్టీసీ కార్మికుడు కదం తొక్కేలా  ఆర్టీసీ ఉద్యోగుల చైతన్య పరుస్తున్నారు అశ్వద్ధామ రెడ్డి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కాగా  ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలతో  ఒక్కసారిగా ప్రభుత్వంపై  ప్రతిపక్ష పార్టీలన్నీ భగ్గుమన్నాయి. 

 

 

 

 అయితే తాజాగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి పై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి.అయితే ఇప్పటి వరకు ఆర్టీసీ సమ్మె విషయంలో  టిఆర్ఎస్ ముఖ్య  నేతలు ఎవరూ స్పందించలేదు. టిఆర్ఎస్ ముఖ్య నేతలైన జగదీష్ రెడ్డి హరీష్ రావు ఈటెల రాజేందర్ లాంటి మంత్రులెవరు ఆర్టీసీ సమ్మె పై ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు. అయితే తాజాగా అశ్వద్ధామ రెడ్డి హరీష్ రావు పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు మౌనంగా ఉండడం మంచిది కాదని... మౌనం వీడి ప్రజాక్షేత్రంలోకి రావాలని అశ్వద్ధామ రెడ్డి కోరారు. 

 

 

 

 ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న వ్యాఖ్యలు నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లు గా ఉన్నాయని అశ్వద్ధామ రెడ్డి విమర్శించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ నిరంకుశ వైఖరి అవలంభిస్తున్నారని అశ్వద్ధామ రెడ్డి ఫైర్ అయ్యారు. తమ డిమాండ్ల లో ఏమైనా తప్పు ఉంటే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి... రేపే విధుల్లో చేరుతామని అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో ఒకే  వ్యక్తికి 44 పెట్రోల్ బంకులు మంజూరు చేశారని... దీనిపై గవర్నర్ తమిళసై కూడా  ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. తనకు అక్రమ ఆస్తులు ఉన్నాయంటూ ప్రభుత్వం కేసులు పెట్టిందని... ఒకవేళ నిజంగా తనకు అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేలితే బహిరంగ ఉరి శిక్షకు కూడా సిద్ధమేనని అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. కాగా అశ్వత్థామరెడ్డి అరెస్టుతో సమ్మె మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: