చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైసీపీప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టానికి తూట్లు పొడిచేలా నిబంధనలను తుంగలోతొక్కుతూ,  పంచాయతీభవనాలకు పార్టీ రంగు లు వేస్తోందని, టీడీపీనేత, మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు ఆక్షేపించారు.   టీడీపీ మాజీశాసనసభ్యులు కలమట వెంకటరమ ణ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తన సొంతనిధులతో శ్రీకాకుళం జిల్లాలోని మాతల గ్రామంలో నిర్మించిన సామాజిక భవనానికి వైసీపీ రంగులేయడమేంటని సుజయకృష్ణ ప్రశ్నించారు. 


ఆ గ్రామంలో రెండు పంచాయతీ భవనాలున్నాయని, వాటిలో ఏదోఒకదాన్ని గ్రామసచివాలయంగా వినియోగిం చుకోవచ్చని, అలాకాకుండా ప్రత్యేకంగా మాజీఎమ్మెల్యే నిర్మించిన సామాజికభవనాన్నే గ్రామసచివాలయంగా మార్చేసి, దానిలో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ, వైసీపీరంగులు ఎలావేస్తారని మాజీమంత్రి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా, గ్రామస్తులతో కలిసి ధర్నాచేస్తూ ముఖ్యమంత్రి డౌన్‌..డౌన్‌ అన్నారన్న కారణంతో వెంకటరమణను, మరో18మంది గ్రామస్తులను అరెస్ట్‌చేయడం ప్రభుత్వ దురహాంకారానికి నిదర్శనమన్నారు. 


తెలుగుదేశం హయాంలో  గడచిన ఐదేళ్లలో చంద్రబాబునాయుడుగారు రాష్ట్రవ్యాప్తంగా 2115 పంచాయతీభవనాలను రూ.210 కోట్లతో నిర్మించారని, ఆయనకు ఇలా ఏనాడు పార్టీలరంగులు వేయాలన్న ఆలోచనరాలేదని రంగారావు తెలిపారు. టీడీపీనేతలు, కార్యకర్తలు ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలతో విబేధిస్తున్నారనే అక్కసుతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈవిధమైన చర్యలకు పాల్పడుతోందన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనరే ఆగస్ట్‌ 28, 2019న లేఖరూపంలో కలెక్టర్లందరికీ రంగులు వేయమని ఆదేశాలివ్వడం దారుణమ ని మాజీమంత్రి వ్యాఖ్యానించారు. 


వైసీపీరంగులు ప్రతి గ్రామంలోని పంచాయతీభవనాలకు వేయమని ప్రభుత్వమే ఆదేశాలివ్వడం, పంచాయతీరాజ్‌ చట్టానికి తూట్లుపొడవడమేనన్నారు. కేంద్రంనుంచి నిధులు తెచ్చుకొని పంచాయతీలను అభివృద్ధిచేయడం చేతగాక, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తమఖాతాలో వేసుకుంటున్న రాష్ట్రప్రభుత్వం రంగులు దిద్దుతూ ప్రజలను ఏమారుస్తుందని సుజయకృష్ణ ఎద్దేవాచేశారు. మాజీఎమ్మెల్యే కలమట వెంకటరమణను, 18మంది గ్రామస్తులను వెంటనే విడుదలచేయాలని టీడీపీ తరుపున ఆయన డిమాండ్‌చేశారు. లేదంటే విషయాన్ని ఉద్యమంలా చేస్తామని, వారు విడుదలయ్యే వరకు పోరాటం చేస్తామని అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: