ట్రెండ్ కి తగ్గట్టు అప్డేట్ అవ్వడం..,, కొత్త కొత్త ప్రయోగాలు చెయ్యడం మానవ సహజ గుణం. ప్రతీ సాయంత్రం నేనున్నా అంటూ మనల్ని పలకరించే చందమామ గురించి ఎంత పొగిడిన తక్కువే. చిన్నప్పుడు చందమామ ని చూపిస్తూ అమ్మ గోరు ముద్దలు పెట్టె వయసు నుంచి., ఎదిగి ప్రయోగాలు చేసేంత వయసు వచ్చే వరకు కూడా చంద్రుని గురించి ఆసక్తి తగ్గదు. నెలపొడుపుతో మొదలై పౌర్ణమి నాటి పూర్ణ చంద్రుని వరకు జరిగే మార్పులకు ఆశ్చర్య పోనీ వ్యక్తులు లేకపోనులేదు. 
నవగ్రహాలలో ఒక గ్రహమైన చంద్రునిపై ఎన్నో ప్రయోగాలు కూడా జరిగాయి. ఒక చిన్న చీమ మొదలు పెద్ద పెద్ద వృక్షాలు సైతం ఎన్నో రకాల కొన్ని వందల వేల ప్రాణులకు ఆధారమైన భూమి వంటి గ్రహమే చంద్రుడు కూడా. అసలు చంద్రునిపై ఎలాంటి వాతావరణం ఉంటుంది? ఆ వాతావరణానికి తగినట్టుగా అక్కడ మనుగడ సాధ్యమా? కాదా?? అనే విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరి కోరిక. దానికి సంబంధించిన సమాచారం ఇప్పుడు మనం చూద్దాం.
ఇటీవలే ఇస్రో చంద్రుని మీదకు చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని పంపిన సంగతి మనకి తెలిసిందే. ఈ చంద్రయాన్ 2 లోని ఆర్బిటర్ చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తూ చంద్రుని ఉపరితలానికి సంబంధించిన  సమాచారాన్ని రాబడుతుంది.  విక్రమ్ చంద్రునిపై దిగే క్రమంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆర్బిటర్కు అమర్చిన కెమెరాలు చంద్రున్ని ఉపరితలాన్ని ఫోటో తీసి భూమిమీదకు పంపుతున్నాయి., కానీ చంద్రుని ఉత్తర ధృవం ఎలా ఉంటుంది అనే విషయం చాలామందికి తెలియదు. ఆ ఉత్తర ధృవానికి సంబంధించిన ఫోటోలను ఆర్బిటర్ కు అమర్చిన ఐఐఆర్ఎస్ పేలోడ్ కెమెరాలు ఫోటోలు తీసీ వాటిని విశ్లేషించి ఇస్రోకు పంపాయి. ఇస్రో ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మంచుకన్నా చల్లనైన చంద్రునిపై ఒక మనిషి మనుగడ సాగించవచ్చా అనే అంశంపై ఇస్రో జరపని ప్రయోగాలు లేవు. 


మరింత సమాచారం తెలుసుకోండి: