ఏపీలో పార్టీని ఎలా బతికించుకోవాలి తెలియక తీవ్రంగా సతమతమవుతున్నారు టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలంగాణలో పార్టీ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఇక ఆంధ్రాలో పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోరంగా ఓడిపోవడంతో చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం లేక తమ భవిష్యత్తు కోసం ఎవరికి వారు ఇతర పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. చంద్రబాబు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేతలకు సైతం నమ్మకం కలిగించే లేక పోతున్నారు. టీడీపీకి ఏ రోజు ఏ నేత షాక్ ఇస్తారా ? కూడా ఎవరికీ తెలియడం లేదు.


కొందరు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలోకి వెళ్లిపోతుంటే మరి కొందరు తమ అవసరాల నిమిత్తం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలోకి చేసేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలు ముగిసిన వెంటనే చంద్రబాబు చేసిన సమీక్షలో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన నేతలపై చర్యలు తీసుకుంటాం అని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారో వారి పేర్లు నియోజకవర్గాల వారీగా తనకు ఇవ్వాలని కూడా సూచించారు.


అయితే ఇప్పుడు ఫలితాలు పార్టీకి పూర్తి వ్యతిరేకంగా రావడంతో పాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు పార్టీలో కొనసాగేందుకు కీలక నేతలు ఎవరూ ఇష్టపడ‌ని నేపథ్యంలో గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నేతలపై ఇలాంటి చర్యలకు దిగటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నేతలపై చర్యలు తీసుకుంటే అసలు పార్టీలో ఉండే ఒకరిద్దరు కూడా మిగిలే పరిస్థితి ఉండటం లేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే వాళ్ళంతా ఇతర పార్టీల్లోకి జంప్ చేసేస్తారు.


ఉదాహరణకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో కొత్తగా ఉమామహేశ్వరనాయుడుకి టికెట్ ఇచ్చారు. ఇండిపెండెంట్ గా వేసిన హనుమంతరాయ చౌదరి చంద్రబాబు గురించి చెప్పిన ఆయన మాత్రం తన వర్గం ఓట్లను వైసీపీ వైపు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. ఉమామహేశ్వరనాయుడు సైతం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోవడంతో హనుమంతరాయచౌదరి సైతం టిడిపిలో యాక్టివ్ అయ్యారు. ఇద్దరు నేతల్లో పార్టీ కేడర్ ఎవరి వైపు వెళ్లాలో తెలియక సతమతమవుతోంది.


వైసీపీకి ఓటు వేసిన వారు టిడిపి కార్యాలయానికి ఎలా వస్తారని ఉమామహేశ్వరనాయుడు వర్గం ఆరోపిస్తోంది. దీనిపై పార్టీ అధినేతకు ఫిర్యాదు చేసిన చంద్రబాబు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు పార్టీలో ఉన్న నేతలపై చర్యలు తీసుకుంటే వారు పార్టీ వీడటంతో పాటు పార్టీకి మరింత నష్టం తెస్తారనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నట్టు కనిపిస్తోంది. ఏదేమైనా ఎన్నికలకు ముందు సొంత పార్టీ నేతలకే వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు...ఇప్పుడు వారి విషయంలోనే చూసి చూడనట్టు వ్యవహరించడం పార్టీ దుస్థితికి అద్దం పడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: