వైసిపి అధినేత వైఎస్ జగన్ కు 2009 నాటికి 2019 నాటికి ఎంతో తేడా ఉంది పదేళ్ల క్రితం తండ్రి చాటు బిడ్డగా కడప ఎంపీగా పోటీ చేసి గెలిచిన జగన్ పదేళ్ల లోనే ఓ పార్టీ స్థాపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అంటే మామూలు విషయం కాదు. పదేళ్ల ప్రయాణంలో జగన్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఎన్నో పోరాటాలు చేసి ఐదేళ్ల తిరక్కుండానే తిరిగి సీఎం అయ్యాడు. అప్పట్లో జగన్ ను ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నాకంటూ ఒక రోజు వస్తుంది అన్న ధీమాతో ఉండేవాడు.


ఇదిలా ఉంటే జగన్ తీరులో ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. రాజకీయంగా ఎంతో పరిణితి చెందారు. ఒకప్పుడు జగన్ ని ఎవరైనా చెప్పారని కానీ, విమర్శించారని తెలిస్తే వాళ్ళని ఎంతమాత్రం దగ్గరకు రానిచ్చేవారు కాదు. అది చెప్పుడు మాట అయినా సరే. కొందరు నేతలు మొదట్లో జగన్ అన్న వెంటే ఉండేది అని చెప్పి...ఆ వెంటనే టిడిపిలోకి వెళ్ళి అక్కడ పదవులు అనుభవించడంతో పాటు జగన్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి పార్టీలోకి వచ్చేస్తామ‌ని అంటున్నారు.


ఇక ఎన్నికలకు ముందు వైసీపీని వీడి పర్చూరులో టీడీపీ అభ్యర్థిని గెలిపించిన రావి రామనాథంని సైతం పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి పోటీ చేసిన కీలక నేతలను సైతం వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇంత చేస్తున్న జగన్ తన తండ్రి కాలం నుంచి తన ఫ్యామిలీ అంటే ఇష్టపడే ఇద్దరు సీనియర్ల విషయంలో మాత్రం అంటీ ముట్టనట్టు గా వ్యవహరిస్తున్నారని, వారిని మాత్రం పార్టీలో చేర్చుకునేందుకు ఎంతమాత్రం ఇష్టపడటం లేదని వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.


విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వైయస్ రాజశేఖర్ రెడ్డికి భక్తుడు. 2004 ఎన్నికల్లో గెలిచిన వెంటనే కేబినెట్లోకి తీసుకున్నారు. మంత్రిగా పనిచేసిన నిజాయితీగా ఉంటారన్న పేరుతెచ్చుకున్నారు. గతంలో వైసీపీలో పనిచేసినా జగన్ మాత్రం ఆయన ఎందుకో గాని దూరం పెట్టేశారు. ఇక అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత సబ్బం హరి గతంలో సబ్బం హరిపై కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణ ఉన్నప్పుడు దానిని ఎత్తి వేయించి అనకాపల్లి ఎంపీ సీటు ఇచ్చి మరి గెలిపించారు.


వైఎస్ మృతి తర్వాత సబ్బం హరి జగన్ వెంట నడిచారు. ఆ తర్వాత అనూహ్యంగా ఆయన జగన్ పై విమర్శలు చేయడంతో జగన్ ఆగ్రహానికి గురై వైఎస్ ఫ్యామిలీకి దూరమయ్యారు. ఇక ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీ లోకి వస్తారు అన్న ప్రచారం జరిగినా... సబ్బం మాత్రం టీడీపీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఏదేమైనా వైఎస్ ఫ్యామిలీ ని జగన్ ను దారుణంగా తిట్టినా నేతలను సైతం పార్టీలోకి తీసుకుంటున్న జగన్ వైయస్సార్ ఫ్యామిలీ అభిమానులుగా ముద్రపడిన ఇద్దరు నేతలను భవిష్యత్తులో అయిన పార్టీలో చేర్చుకుంటారా ? లేదా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: