ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి... రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే  కాకుండా ఇవ్వని హామీలను కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెడుతూ... పారదర్శక పాలన అందిస్తున్నారు . ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి... పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. అయితే జగన్ పాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలే  కాదు... పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆకర్షితులవుతున్నారు. 

 

 

 

 ఇప్పటికే ఆర్టీసీ సంస్థను  ప్రభుత్వం లో విలీనం చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు జగన్ . అయితే పొరుగు రాష్ట్రాల ప్రజలు  సైతం  జగన్ నిర్ణయాలను  అభినందిస్తూ  పాలాభిషేకాలు సైతం చేస్తున్నారు. తెలంగాణలో అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వలే  తెలంగాణలో  కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ  సమ్మె చేస్తున్నారు. అయితే జగన్ పాలన పై ఇప్పటికే రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నారని కితాబిచ్చారు. జగన్ పాలన చూసి ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలే  కాదు... ప్రతి పక్షా ఎమ్మెల్యేలు సైతం ఆకర్షితులవుతున్నారు. 

 

 

 

 తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అభిషేకం చేశారు. అయితే జగన్ ఎన్నికళ్లో  ఆటో ట్యాక్సీ డ్రైవర్ లకు 10000 చెల్లించేందుకు హామీ ఇచ్చారు... ఆ హామీని  నిలబెట్టుకుంటూ తాజాగా వైఎస్ఆర్ వాహన మిత్ర పేరుతో కొత్త పథకాన్ని తీసుకు వచ్చారు.కాగా  ఇటీవల సీఎం జగన్  ఈ పథకాన్ని  ఏలూరులో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాపాక వరప్రసాద్... మంత్రి  విశ్వరూప్ తో కలిసి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అయితే జగన్  ఆటోడ్రైవర్ చొక్కా  వేసుకొని పథకాన్ని ప్రారంభించగా .. తాజాగా  పాలాభిషేకం చేసే సమయంలో మంత్రి విశ్వరూప్ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఆటో డ్రైవర్ ఖాకి  చొక్కాలు ధరించి పాలాభిషేకం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: