అడ్డగోలు ఆరోపణలకు కేరాఫ్ అడ్రెస్ ఏదైనా ఉందంటే అది...ఆంధ్రజ్యోతి మీడియానే అన్న విమ‌ర్శ‌లు ఇప్పుడు ఏపీ రాజ‌కీయ‌, మీడియా వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వానికి బాకా ఊదిన ఏ‌బి‌ఎన్...వైసీపీ ప్రభుత్వం రాగానే అక్కసు వెళ్లగక్కడం మొదలుపెట్టింద‌ని వైసీపీ వర్గాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. అసలు మొన్నటివరకు టీడీపీకి మామూలు భజన చేయలేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్‌కు ఓ రేంజ్ లో డప్పు కొట్టార‌న్న‌ది ఏపీ జ‌నాలే చెపుతున్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ పైన వారు అసత్య కథనాలు ఓ రేంజ్ లో ప్రచారం చేశారు. అయినా సరే ఆ యెల్లో ఏ‌బి‌ఎన్ ఎన్ని వ్య‌తిరేక‌త క‌థ‌నాలు వండి వార్చినా వాటిని తిప్పికొట్టి, జగన్ అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చార‌ని వైసీపీ చెపుతోంది.


జగన్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి ఆయన మీద పడి ఏడవటం మొదలుపెట్టింద‌న్న విమ‌ర్శ‌లుల తీవ్రంగా ఉన్నాయి. ఈ ఐదు నెలల్లోనే జ‌గ‌న్‌పై అడ్డగోలు ఆరోపణలు చేశార‌ని కూడా జ్యోతిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామ సచివాలయ ఉద్యోగాలపై ఏ‌బి‌ఎన్ అసత్య కథనాలని వరుసగా ప్రచురించార‌ని.... గతంలో ఏ సీఎం చేయని విధంగా జగన్ లక్షల్లో గ్రామ సచివాలయాల ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా జ్యోతి త‌మ‌పై అక్క‌సు వెళ్ల‌క‌క్కుతోంద‌ని వైసీపీ విమర్శ‌లు చేస్తోంది. ఈ నియమకాల్లో ఎక్కడ ఎలాంటి అవతవకలు జరగకుండా అర్హులైన వారికే ఉద్యోగాలు ఇచ్చారు. ఆఖరికి సొంత పార్టీ నేతలు ఉద్యోగాల్లో సిఫారులు చేయాలని చూసిన, వారికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు.


ఈ విధంగా జగన్ ఉద్యోగాలు నియమకాలు చేపడితే పేపర్ లీక్ అయిందని, ఏ‌పి‌పి‌ఎస్‌సి లో పని చేసే ఉద్యోగులకే మొదటి ర్యాంక్ వచ్చిందని, మొదటి ర్యాంకుల్లో సీఎం సామాజికవర్గం వారే ఉన్నారని లేనిపోని జ్యోతిలో వార్త‌లు వ‌చ్చిన విష‌యాన్ని వైసీపీ వాళ్లు ప్ర‌స్తావిస్తున్నారు. అయితే ఆంధ్రజ్యోతి కథనాలపై వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. అటు ఉద్యోగాలు దక్కిన వారితో పాటు, దక్కని వారు కూడా  ఆంధ్రజ్యోతిని ఈసడించుకుంటోన్న సంఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. ఇక గ్రామ సచివాలయాలపై విషం కక్కడం ముగియగానే పోలవరం రివర్స్ టెండరింగ్ కు, ఎలక్ట్రిక్ బస్ టెండర్లకూ, ముడిపెట్టి ఆంధ్రజ్యోతి కథనాలు రాసింది.


మంత్రి పేర్ని నాని ప‌క్కా ఆధారాల‌తో స‌హా ఆంధ్ర‌జ్యోతిని ఏకేస్తున్నారు. అసలు పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల వందల కోట్ల ప్రజా ధనం ఆదా అయింది.  దానికి బస్సు టెండర్లుకు సంబంధం లేదు. పైగా బస్సులని ఏ పద్దతిలో కొనుగోలు చేయాలో ఇంకా ఆలోచనలో ఉన్నారు. అటు అధికారుల బదిలీలపై కూడా ఇష్టమొచ్చినట్టు వార్తలు రాసేసింది.  ఇలా అడ్డగోలుగా వార్తలు రాస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ఆంధ్రజ్యోతి పని చేస్తుంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక మిగిలిన నాలుగున్నర ఏళ్లలో జగన్ ప్రభుత్వంపై ఇంకా ఎన్ని అడ్డగోలు ఆరోపణలు చేస్తుందో చూడాల‌ని వైసీపీ వాళ్లు జ్యోతిపై సెటైర్లు వేస్తున్నారు. ఇక రాధాకృష్ణ వాస్త‌వాలు గ్ర‌హించి రాస్తే ఆ ప‌త్రిక‌కు విలువ ఉంటుంద‌ని... లేనిప‌క్షంలో ఆంధ్ర‌జ్యోతి మీడియాను ప‌ట్టించుకునే వాళ్లే ఉండ‌ర‌న్న విమ‌ర్శ‌లు వైసీపీ నుంచి తీవ్రంగా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: