మరి తెలిసి మాట్లాడారో లేకపోతే ఏదో ఫ్లోలో చెప్పేశారో కానీ  జగన్మోహన్ రెడ్డే శక్తివంతుడని చంద్రబాబునాయుడు అంగీకరించేశారు. మీడియాలో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో తప్పు జరిగినపుడు తాను చెబితే వెంటనే సరిదిద్దుకునేవారు అన్నారు. తానంటే వైఎస్సార్ భయపడేవారని గతంలోనే చంద్రబాబు చెప్పుకుని తృప్తి పడుతున్న విషయం తెలిసిందే.

 

వైఎస్సార్ హయాంలో కూడా మీడియాపై ఆంక్షలు పెట్టటానికి ప్రయత్నిస్తే తాను తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. మీడియా స్వేచ్చకోసం తాను పెద్ద ఎత్తున అప్పట్లో పోరాటం చేసినట్లు చెప్పుకోవటమే విచిత్రం. నిజానికి అప్పట్లో చంద్రబాబు చేసిన పోరాటాలేమీ లేదు. చంద్రబాబు కన్నా జర్నలిస్టు సంఘాలే పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి.

 

నిజానికి చంద్రబాబు ఏ రోజు కూడా ఏ విషయంలోనూ పోరాటాలు చేసింది లేదు. మీడియాతో ఒకటికి పదిసార్లు మాట్లాడటాన్నే చంద్రబాబు పోరాటాలుగా భావిస్తే ఎవరు కూడా చేసేదేమీ లేదు. పైగా మీడియాపై ఆంక్షల విషయంలో  తాను చేసిన పోరాటానికి వైఎస్సార్ భయపడిపోయి వెంటనే జీవోను ఉపసంహరించుకున్నట్లు కతలు చెప్పటమే విడ్డూరంగా ఉంది.

 

వైఎస్సార్ గురించి మాట్లాడుతునే తాను చెబితే వైఎస్సారే వినేవాడని కానీ జగన్ మాత్రం తనను అసలు లెక్క చేయటం లేదంటూ ఉడుక్కున్నారు. జగన్ తో పోలిస్తే వైఎస్సారే వెయ్యిరెట్లు బెటరన్నారు. ఏదన్నా విషయంలో తప్పు చేస్తున్నారని ఎవరైనా చెబితే వైఎస్ వినేవారని కూడా అన్నారు. అయితే అదే సమయంలో ఎవరు చెప్పినా జగన్ అసలు లెక్కేపెట్టటం లేదన్నారు.

 

చంద్రబాబు తాజా వ్యాఖ్యలు విన్నవారికి ఈ మాజీ సిఎం ఎంత మొత్తుకుంటున్నా జగన్ అసలు లెక్కే చేయటం లేదనే విషయం బోధపడుతుంది. నిజానికి జగన్ అసెంబ్లీలో మాట్లాడుతుంటే చంద్రబాబుకు దిక్కు తెలియటం లేదు. అందుకనే చాలా సార్లు అసెంబ్లీ నుండి వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నారు.  ఇక  వైఎస్సార్ హయాంలో కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినంత కాలం చంద్రబాబు నోరెత్తలేకపోయిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తం మీద తనకంటే జగనే శక్తవంతుడని చంద్రబాబు ఒప్పేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: