ఈ మధ్య ఎక్కడ చుసిన  టీ కాఫీ తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సంతోషం వచ్చినా టీ తాగుతారు...  బాద  వచ్చిన టీ తాగుతారు...టెన్షన్  వచ్చిన టీ తాగుతారు...  అసలేం టెన్షన్ లేకున్నా టీ లాగించేస్తారు .... ఇలా జీవితంలో టీ తాగడం ఒక భాగమైపోయింది. ఇక కొంతమంది కైతే టీ తాగకపోతే ప్రపంచం మునిగి పోతున్నట్లుగా ఫీలవుతుంటారు. అయితే టీ తాగడానికి కొంతమంది స్పెషల్ కప్పులను   తయారు రెడీ చేసుకుంటారు . కొంతమంది టీ తాగే కప్పులను డస్ట్ బిన్లో పడేస్తూ  ఉంటారు. కానీ ఇప్పుడు ఈ కొత్త కప్  తో మీ అలవాట్లను మార్చుకోవాల్సిందే . ఇప్పుడు వరకు టీ తాగి  కప్ ని  డస్ట్ బిన్లో పడి సారేమో ఇప్పుడు మాత్రం టీ తాగిన కప్పను తినేయాల్సిందే . టీ తాగిన కప్పు  తినడం ఏంటి  అంటారా... ఇక్కడ వీళ్ళు  తయారు చేసిన కప్పులో  టీ తాగేసి తర్వాత తినవచ్చు.

 

 

 

 హైదరాబాద్ కు చెందిన ప్రైవేట్ సంస్థ వినూత్న టీ కప్పులను  తయారుచేసింది. ఈ టీ కప్పులను ఈట్ కప్పులు   అంటారు. పర్యావరణ పరిరక్షణను  దృష్టిలో ఉంచుకుని  ఓ ప్రైవేట్ సంస్థ ఈ కప్పులని  తయారు చేసిందట. అయితే ఈ కప్పులో వేడి పదార్థాలనే  కాదండోయ్... చల్లటి పదార్థాలను కూడా ఉంచుకోవచ్చు. ఈ  కప్పులను తయారుచేసిన సంస్థ ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ... ప్లాస్టిక్ పేపర్ కకప్పులతో పర్యావరణానికి హాని కలుగుతుందనే  ఉద్దేశంతోనే వాటికి ప్రత్యామ్నాయంగా ఈ కప్పులను  తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఈట్ కప్పులను   ధాన్యాలతో తయారు చేయడం జరిగిందని ... ఈ టీ కప్పులో టీ తాగిన తర్వాత ఈ కప్పను తినేయ్యోచు అని  తెలిపారు. 40 నిమిషాల పాటు గట్టిగా ఉండే ఈ కప్పులో  వేడి గా ఉండేవే కాకుండా చల్లటి పానీయాలు,  పెరుగు లాంటివి కూడా వేసుకోవచ్చును తెలిపారు. 

 

 

 

 అయితే ప్లాస్టిక్ పేపర్ తో పర్యావరణానికి హాని కలగకుండా వాటికి ప్రత్యామ్నాయంగా ఈ  కప్పు లని  తయారు చేయడంతో ఈ సంస్థ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇదిలా ఉండగా ట్విట్టర్ కొంతమంది ఈ కప్పులపై  భిన్నంగా స్పందిస్తున్నారు. ఒకవేళ కప్పు టీ తాగేలోపే  కరిగిపోతే  పరిస్థితి ఏంటి ... వీటికంటే మట్టి కప్పులు వాడటం మంచిది అంటూ  కొంతమంది బిన్నంగా స్పందిస్తున్నారు . ఏదేమైనా పర్యావరణ రక్షణ కోసం ఈ కొత్త కప్పులని  కనిపెట్టిన ఈ సంస్థకు అభినందనలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: