విశాఖలో చోటు చేసుకున్న భూ దందాలపై మరో సారి సిట్ ని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇపుడు జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తోంది. సిట్ పేరిట గత చంద్రబాబు సర్కార్ ఓ మొక్కుబడి వ్యవహరం నడిపి కధ కంచికి చేర్చారని వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. ఇపుడు వారి ప్రభుత్వమే వచ్చింది. దాంతో సిట్ ని ఏర్పాటు చేశారు. దీని మీద వైసీపీ, టీడీపీల మధ్య మరో మారు రాజకీయ యుధ్ధమే చెలరేగుతోంది.


ఇదిలా ఉండగా సిట్ విచారణను తాను స్వాగతిస్తున్నట్లుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా ప్రకటించడం విశేషం. ఆయన దీని మీద ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేస్తూ సిట్ విచారణ మరోసారి జరపాలని తాను గత సర్కార్ నే డిమాండ్ చేసినట్లుగా పేర్కొన్నారు. ఇపుడైనా ఈ ప్రభుత్వం సిట్ విచారణను ఏర్పాటు చేయడం మంచి పరిణామమ‌ని ఆయన అన్నారు.


ఇదిలా ఉండగా సిట్ విచారణ వల్ల వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని కూడా గంటా చెప్పడం విశేషం. మొత్తానికి గంటాను టార్గెట్ గా చేసుకుని సిట్ విచారణను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వార్తలు వస్తున్న నేపధ్యంలో గంటా స్వయంగా ముందుకు వచ్చి వెల్ కం చెప్పడం రాజకీయ వర్గాలలో  సంచలనంగా  ఉంది. 


మరో వైపు జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు సైతం సిట్ విచారణను వేయడాన్ని సమర్దించుకున్నారు. విశాఖ జిల్లాకు సంబంధించి ఎందరో బడా బాబులు, టీడీపీ నేతలు విశాఖ కుంభకోణాల వెనక ఉన్నారని ఆయన అన్నారు. వారందరి జాతకాలు బయటపెడతామని ఆయన చెప్పుకొచ్చారు. సిట్ విచారణలో అసలైన నేరస్తులు  బయటకు వస్తారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ అన్నారు.  భూదందా కోసం రికార్డులు మొత్తం ట్యాంపరింగ్ చేశారని కూడా గుడివాడ ఆరోపించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: