వైసీపీలో చేరిన ఎన్టీయార్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వరసగా షాకులు తగులుతున్నాయి. ఆయన  ప్రకాశం జిల్లా పర్చూర్ నుంచి పోటీ చేయాలని మొదట అనుకోలేదు, కొడుకు చెంచురాం కోసం వైసీపీలో చేరారు. చివరికి తానే బరిలోకి దిగాల్సివ‌చ్చింది. ఇదిలా ఉండగా ఎన్నికల్లో జగన్ గాలి ఓ వైపు ఉన్నా కూడా ఘోరంగా దగ్గుబాటి ఓడిపోయారు. ఇక ఆయన్ని ఓడించింది కూడా వైసీపీకి చెందిన నాయకులే కావడం మరో షాక్.


అలా టీడీపీలో చేరి దగ్గుబాటిని ఓడించిన వారే ఇలా తిరిగి వచ్చి వైసీపీలో చేరడం ఇంకో షాక్. రావి రామనాధం వైసీపీలో చేరడంతోనే దగ్గుబాటి ప్లేస్ ఏంటో చెప్పేశారు. ఇపుడు ఆయనకు ఉన్న ఏకైన పదవి  పరుచూరు ఇంచార్జి. దానిని కూడా తీసేయాలన్నది ఆలోచనగా ఉందన్న ప్రచారం సాగుతోంది. 


ఎందుకంటే దగ్గుబాటి పార్టీలో యాక్టివ్ గా లేరన్న దాని మీదనే ఈ రచ్చ సాగుతోంది. పరుచూరు ఇంచార్జిగా ప్రస్తుతం దగ్గుబాటి ఉన్నారు. కొత్త ఇంచార్జి ఎవరో వారం రోజుల్లో నిర్ణయిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. పరుచూరి ఇంచార్జి ఎవరన్న దాని మీద వారంలో క్లారిటీ వస్తుందని ఆయన చెప్పడంతో దగ్గుబాటికి ఆ పదవి కూడా వూడుతుందా అన్న డౌట్లు వస్తున్నాయి.


ఇదిలా ఉండగా దగ్గుబాటి సతీమణి పురంధేశ్వరిని వైసీపీలో చేరాలని మంత్రి బాలినేని ఆహ్వానించడం విశేషం. ఆమె కనుక పార్టీలోకి వస్తే సముచిత స్థానం ఇస్తామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. భార్యాభర్తలు ఇద్దరు ఒకే పార్టీలో ఉండాలన్న బాలినేని ఆ పార్టీ వైసీపీయేనని చెబుతున్నారా లేదా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది. మొత్తానికి ఎన్టీయార్  పెద్దల్లుడికి రాజకీయంగా షాకులే తగులుతున్నాయని అంటున్నారు. మరి చూడాలి దగ్గుబాటి రివర్స్ షాక్ ఎలా ఉంటుందో అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: