ఉద్యమసెగ ఎలాగుంటుందో కెసియార్ కు మొదటిసారి తెలిసివచ్చింది. ఆర్టీసీ సమ్మె ఫలితంగా కెసియార్  హై కోర్టు నుండి అక్షింతలు వేయించుకోవాల్సొచ్చింది.  ఉధృతంగా జరుగుతున్న  సమ్మె విషయంలో కెసియార్ ను హై కోర్టు దుమ్ము దులిపేసింది. హై కోర్టు ప్రభుత్వాన్ని ఏ స్ధాయిలో వాయించేసిందంటే  అడ్వకేట్ జనరల్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇవ్వలేకపోయారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే సమ్మెను నియంత్రించటంలో కెసియార్ విఫలమయ్యారని కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో ప్రజల్లో అసంతృప్తి మొదలై  ప్రభుత్వం మీద తిరగబడితే ఎవరైనా ఆపగలరా ? అంటూ నిలదీసింది. ప్రజలే అత్యంత శక్తిమంతులన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించిందా అంటూ అడిగింది.

 

రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోయిందన్న సూటి ప్రశ్నకు అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పలేకపోయారు. ఆర్టీసీకి ఎండిని పూర్తిస్ధాయిలో ఎందుకు నియమించలేకపోయిందని ప్రశ్నించింది. ఇపుడున్న ఇన్చార్జి కూడా సమర్ధుడైన అధికారే అన్న అడ్వకేట్ జనరల్ సమాధానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

 

ఇన్చార్జి ఎండి అంత సమర్ధుడే అయితే ఆయన్నే ఎందుకు పూర్తిస్ధాయి ఎండిగా నియమించలేదని నిలదీసింది.  మొత్తం మీద కార్మికుల వాదనే సబబుగా ఉందని కోర్టు అభిప్రాయపడినట్లు అర్ధమవుతోంది. అందుకనే కార్మిక సంఘాల నేతలతో చర్చలు పూర్తి చేయటానికి ప్రభుత్వానికి కోర్టు మూడు రోజులు గడువివ్వటమే విచిత్రంగా ఉంది. అంటే కెసియార్ కు ఇష్టమున్నా లేకపోయినా కార్మికసంఘాల నేతలతో చర్చలు జరపాల్సిందే.

 

హై కోర్టు తాజా వ్యాఖ్యలతో  ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. అందుకనే అడ్వకేట్ జనరల్ వాదనను కొట్టేసింది. అంతేకాకుండా  ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేట్లుగా ఏజిని నిలదీసిన విషయం అందరికీ అర్ధమైపోతోంది. కాబట్టి ఇప్పటికైనా కెసియార్ తన ఇష్టాఅయిష్టాలను పక్కనపెట్టి కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపితే జనాలకు ఇబ్బందులు తప్పుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: