భారతదేశంలో బాబా ల సంస్కృతి చాలా ఎక్కువ. కొందరు బాబాలు తామే దైవాంశ సంభూతులమని చెప్తూ డబ్బులతో అవసరం లేదంటూనే తాము సంపాదించుకుంటూ ఉంటారు.జీవితంలో డబ్బు ముఖ్యం కాదు అని చెప్పే బాబాల వద్దే కోట్ల డబ్బు కనిపిస్తుంది. అదేం విచిత్రమో కానీ ఈ బాబాల పేరు మీద అనేక కేసులు నమోదయ్యి ఉంటాయి. అయితే బాబాల వద్ద చాలా డబ్బు మూలుగుతుందనే టాక్ ఉంది.


ఈ బాబాలకి విదేశాల్లో కూడా భక్తులు ఉండటం విచిత్రం. భక్తుల విషయం అటుంచితే ప్రస్తుతం కల్కి భగవాన్ ఆస్తుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.  ప్రస్తుతం కల్కి భగవాన్ ఆస్తులపై ఐటీ ఆకస్మిక దాడులని జరిపింది. ఈ దాడుల్లో బయటపడ్డ ఆస్తుల వివరాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవడం ఖాయం.  ఒక సారి కల్కి ఆస్తుల వివరాల్లోకేళితే, 44 కోట్ల నగదు, 25 లక్ష్ల అమెరికా డాలర్లు అంటే మన కరెన్సీలో 18 కోట్లు, 88 కిలోల బంగారు ఆభరణాలు..వీటి విలువ సుమారు 26 కోట్లు.


1271 క్యారెట్ల డైమండ్ విలువ 5 కోట్లు.. ఇంకా ఇతర దేశాల కరెన్సీ కొంత. వీటన్నింటిని కలుపుకుంటే దాదాపు 93 కోట్ల పైమాటే. బాబాగా ఫేరు పొంది, సకల సౌఖ్యాలను దూరంగా ఉంటామని చెప్పుకునే వారికి ఇన్ని ఆస్తులు ఎందుకు అవసరమో ఎవరికి అర్థం కాదు.అయితే ఐటీ దాడులు జరిగినప్పటి నుండి కల్కి భగవాన్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు.కల్కి ఇన్ని ఆస్తులు సంపాదించడానికి రాజకీయంగా అతనికి సాయం అంది ఉంటుంది అనే వాదన కూడా ఉంది.


కానీ దాని గురించి ఇప్పుడు అనవసరం. ఐతే ఈ ఆస్తులు ఇంతటితో అయిపోలేదు. బెంగళూరు, చెన్నై, హైదరాబాదు కేంద్రాల్లో డాక్యుమెంట్ల్ కోసం వెతుకుతూనే ఉన్నారు. అంతా అయిపోయాక మొత్తం ఆస్తులు ఎంత అనేది బయటకి వస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: