తెలంగాణ‌లోని సూర్యాపేట అసెంబ్లీ స్థానానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక ఎంత ర‌స‌వ‌త్త‌రంగా ఉందో ప్ర‌చార స‌రళే చెపుతోంది. ఇక శ‌నివారంతో ఇక్క‌డ ప్ర‌చారం ముగియ‌నుంది. ఈ నెల 21న ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా.... 24న ఓట్లు లెక్కింపు జ‌ర‌గ‌నుంది. ఇక టీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సైదిరెడ్డినే మళ్లీ బరిలోకి దింపి ఓడిపోయిన సెంటిమెంట్ క్యాష్ చేసుకోవాల‌ని చూస్తోంది. అందుకే మ‌ళ్లీ సైదిరెడ్డినే రంగంలోకి దింపింది. గ‌త ఎన్నిక‌ల్లో సైదిరెడ్డి కేవ‌లం 7 వేల ఓట్ల‌తో మాత్రమే ఓడిపోగా...అప్పుడు రోడ్డు ట్ర‌క్కు గుర్తుకు 7 వేల ఓట్లు ప‌డ‌డం కూడా ఉత్త‌మ్ గెలుపున‌కు ప‌రోక్షంగా సాయం చేసిన‌ట్ల‌య్యింది.


ఇక ఇప్పుడు కాంగ్రెస్ నుంచి టీ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి భార్య ప‌ద్మావ‌తి పోటీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. పీసీసీ అధ్య‌క్షుడు రాజీనామా చేసిన స్థానం కావ‌డంతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ స్థానం చేజార‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఇక్క‌డ గెలుపు కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. టీ కాంగ్రెస్‌లో ఉన్న అసంతృప్త వాదులంతా ఈ ఎన్నిక‌ల్లో ఒక్క‌టై మ‌రీ ప్ర‌చారం చేశారు. ఇక ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో అధికార పార్టీకి ప‌రిస్థితులు వ్య‌తిరేకంగా ఉన్న నేప‌థ్యంలో చివ‌ర్లో కేసీఆర్ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని టీఆర్ఎస్ ప్లాన్ చేసినా భారీ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్ద‌యిన సంగ‌తి తెలిసిందే.


ఇటు టీఆర్ఎస్  అభివృద్ధి మంత్రం ఫలిస్తుందా.. అటు బలమైన ఉత్తమ్ తన నియోజకవర్గాన్ని గులాబీకి దక్కకుండా కాపుకాస్తాడా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇక మ‌ధ్య‌లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప‌రువు కాపాడుకునేందుకు టీడీపీ పోటీలో ఉన్నా అవి నామ‌మాత్ర‌పు పోటీ ఇచ్చే ప‌రిస్థితి కూడా లేక ముందే చేతులు ఎత్తేశాయి. బీజేపీ ఇప్ప‌టికే టీఆర్ఎస్ ఆగ‌డాల‌ను ఈసీ ప్ర‌త్యేక అధికారులో ఆరిక‌ట్టేసింది. ఇక ప్రజాసంఘాల నుంచి మల్లన్న సహా కొన్ని చిన్న పార్టీలు బరిలోకి దిగాయి.


ఇక హోరాహోరీ పోరు నేప‌థ్యంలో ఇక్క‌డ ఒక్కో ఓటుకు 2000 నుంచి  3000  దాకా పంచేందుకు పార్టీలు ఇప్ప‌టికే రెడీ అవుతున్నాయంటున్నారు. ఈ టఫ్ ఫైట్ లో గెలుపు ఎవరిదైనా హుజూర్ నగర్ ఓటర్ల పంట పడడం  మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: