సాధారణంగా ఫుడ్ డెలివరీ జాబ్ అంటే అబ్బాయిలే చేస్తారు.  పురుషులు మాత్రమే డెలివరీ రంగంలో పనులు చేయగలరని మహిళలు ఆ పనులు చేయటం అంత సులభం కాదని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ హైదరాబాద్ లో పురుషులకు ధీటుగా ఒక యువతి డెలివరీ జాబ్ చేస్తోంది. జనని రావ్ అనే ఈ యువతి 20 సంవత్సరాల వయస్సులో మిగతా యువతులకు భిన్నంగా స్విగ్గీ డెలివరీ ఏజెంట్ గా కెరీర్ ఎంచుకుంది. 
 
జనని రావ్ డెలివరీ జాబ్ గురించి మాట్లాడుతూ జాబ్ లో 75 రోజుల క్రితం జాయిన్ అయ్యానని, డెలివరీ జాబ్ చాలా ఆసక్తికరంగా ఉందని, ఈ జాబ్ లో ఫన్ కూడా ఉందని ఆ అనుభవం మాటల్లో చెప్పలేనని చెప్పింది. పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా జనని సర్వీస్ అందిస్తూ ఉండటం విశేషం. డెలివరీ ఫీల్డ్ లో మహిళను చూడటం చాలా ఆనందంగా ఉందని కస్టమర్లు చెబుతున్నారని జనని చెబుతోంది. 
 
జాబ్ ను ఎంత ఎంజాయ్ చేయగలిగితే అంత బెటర్ గా చేయగలమని జనని చెబుతోంది. డెలివరీ జాబ్ చేస్తున్నందుకు కస్టమర్లు తనను ఎంతో అభినందిస్తున్నారని జనని చెబుతోంది. మహిళలు ఎవరైనా ఎటువంటి భయం లేకుండా, ఆందోళన పడకుండా ఈ జాబ్ లో చేరొచ్చని జనని చెబుతోంది. హైదరాబాద్ నగరంలో మహిళలకు పూర్తి రక్షణ ఉందని జనని అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
అమ్మాయిలు ఫుడ్ డెలివరీ రంగంలోకి రావాలని జనని ఆహ్వానించింది. అమ్మాయిలు సెక్యూరిటీ గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదని జనని చెబుతోంది. మహిళ తలచుకుంటే ఏదైనా సాధించగలదని జనని చెబుతోంది. జనని రావ్ గురించి తెలిసిన నెటిజన్లు విపరీతంగా ప్రశంసిస్తున్నారు. ఎలాంటి ఆందోళన, భయం లేకుండా జాబ్ చేయటంతో పాటు భయం లేకుండా ఈ జాబ్ లో జాయిన్ కావొచ్చని చెబుతూ ఉండటాన్ని ప్రశంసిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: