హైదరాబాద్ శివార్లలోని నాచారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా అక్కడే ఉన్న చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ బాంబు పేలుడు విషయాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.         

                                  

రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్, క్లూస్ టీమ్ పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు కారణంగా చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్ పై ఉన్న బాటిల్ ని ఇంటిలోకి తీసుకు వెళ్లిన చిన్నారి అక్కడ ఆ బాటిల్ కిందకి పడడటంతో పెద్ద శబ్దంతో బాబు పేలుడు సంభవించింది. దీంతో అక్కడ ఉన్న స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.      

                                      

కాగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాబు పేలుడు ఎందుకు సంభవించింది అని విచారిస్తున్నారు. మరి ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా త్వరలో దీపావళి పండుగా ఉండటంతో ప్రజలు జాగ్రత్త పడాలి అని సూచిస్తున్నారు. టపాసులు విక్రయించే చోటా ఎలాంటి నిప్పు ఉండకుండా చూసుకోవాలని, అలాగే టపాసులు పేల్చే చోట జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.       

                                           

మరింత సమాచారం తెలుసుకోండి: