తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు నానాటికి తీసికట్టు నాగంబొట్లు అన్నట్లుందన్నది తెలుగు తమ్ముళ్ల అభిభాషణ. నలభై సంవత్సరాల అనుభవం అంటూ ప్రతి సారీ చెప్పే చంద్రబాబు తను పొందిన ధారుణ పరాభవం తరవాతనైనా తాను అనుభవఙ్జుడుగా ప్రవర్తించటం లేదు. చచ్చి చెడి చావుతప్పి కన్నులోట్టపోయినట్లు ప్రతిపక్ష నాయక స్థానమైనా నిలబెట్టుకున్నా – జగన్ రెండు కళ్లు తెరిచి చూస్తే చాలు, పుటుక్కుమని తెగిపోయేలా ఉందా స్థానం.  

 

ఇపుడు ఆయన ప్రతి చిన్న విషయంపై దూకుడు ప్రదర్శిస్తుండటం  రాష్ట్ర ముఖ్యమంత్రిని అనేక దుర్భాషలాడటం, సమయోచితంగా లేదు. ఆలోచించాల్సిన సమయం లో   ఆయన ఇంకా అనాలోచితంగా మాట్లాడటం ఆయన అనుభవమున్నా అనుభవ హీనుడుగా ప్రవర్తించటం అంతగా రాణించటం లేదు. ఆయనకు తోడు ఆయనకు వంత పాడే మీడియా తెచ్చిపెడుతున్న ప్రమాదం అత్యంత దయనీయం. 

 

తన పార్టీకి తన అనుచరులకు దిశానిర్దేశం చేయాల్సిన సమయంలో — మాట విలువనే క్రమంగా కోల్పోతున్నారు. పార్టీలో చంద్రబాబు డెబ్బయేళ్ల ముదిమి వయసులో కూడా అన్నీ తానే, అంతా తానే అన్నట్లుగా దూసుకుపోతానంటే — మనసు వేగంతో దేహం పరుగు పెట్టగలదా! ఇప్పుడు జగన్ అదే తప్పు చేస్తే కాస్త సమయోచితంగా వ్యవహరించాల్సిన వేళ చిల్లరగా విమర్శిస్తే తను ఒక వేలితో చూపే తప్పు, తన గత కాలం తప్పులను  తనవైపే చూపే తన నాలుగువేళ్ళే తనకు శత్రువులౌతాయి.  తద్వారా తన ప్రవర్తనతో తనను తానే కోల్పోతున్నారు. అయిదేళ్ల చంద్రబాబు పాలన ముగిసిన తరవాత అధికారంలోకి వచ్చిన తరవాత  జగన్ ను కనీసం ఒక సంవత్సర కాలం అడ్దు లేని పాలన చేయనిస్తే తప్పులు దొరికే అవకాశం పుష్కళంగా ఉంటుంది, 

 

కారణాలు ఏవైనా కావచ్చు కొత్త ప్రభుత్వానికి ఒక సంవత్సరం తరువాత జోరు తగ్గుతుంది.  తొందరపాటున సైతం పాలనలో కొన్ని తప్పులు అనివార్యం అవుతాయి. ఇలా చంద్రబాబు అనుక్షణం జగన్ తప్పులెత్తితే తనపై నిఘా ఉందనుకొని అనుక్షణం జాగ్రత్త పడతాడు.  తప్పులు ప్రభుత్వం వైపు నుంచి లేదా అధికారుల వైపు నుంచి జరిగే అవకాశాలకు సమయం ఇవ్వాలి. పాలన తొలి దశలోనే చంద్రబాబు ఇలా ప్రవర్తిస్తే జనం సానుభూతి జగన్ కు దక్కుతుంది. అప్పుడు చంద్రబాబు నిజంగా ప్రభుత్వం తప్పిదాలపై యుద్ధభేరి మోగించినా "బాబింతేలే!" అనుకుంటారు జనం. ఈ విషయం విశ్లేషకుల నుండే కాదు స్వపక్షం టీడీపీలో కూడా ద్వనిస్తున్న మాట. 

 

చంద్రబాబు ఎపుడూ జగన్ ని తిడుతూనే ఉంటారనుకుని, జనం సరిగ్గా సరైన సమయంలో, స్పందించకపోతే రాజకీయ నష్టం అతి భయంకరంగా టీడీపీకే జరుగుతుంది. చంద్రబాబు ఇప్పుడు నిశ్శబ్ధం పాటించి ఉన్నట్లైతే ఆయనపై ప్రజల్లో నమ్మకం, ఆదరణ, గౌరవం ఇనుమడించి ఉండేవి. మరో వైపు ఆయనను 'చిల్లర మనిషి' అని ఉండే వారు కాదు. హుందాతనం ఇనుమడించి ఉండేది. కానీ చంద్రబాబు జగన్ ఇలా ముఖ్యమంత్రి అయిన వెన్వెంటనే ఆయనపై, ప్రత్యేకించి వ్యక్తిగత విమర్శలతో చెలరేగి పోతున్నారు. గత ఐదు నెలల కాలంలో ఆయన విమర్శలు శిఖరాగ్రానికి చేరిపోయాయి. 

 

తిట్టిన తిట్లు పదే పదే తిట్టిటంతో పదును కోల్పోయిన ఆ తిట్లు సైతం వినటానికి దారుణంగా ఉంటున్నాయి. జగన్ వ్య‌క్తి గత విషయాలను కూడా ముందుకు తెచ్చి మరీ దారుణంగా నిందిస్తున్నారు. మరి చంద్రబాబుకు ఎందుకింత నోటి దూల? చంద్రబాబు తనకున్న శక్తినంతా ఇపుడే ఇలా నిరుపయోగం చేసేస్తే, రాబోయే రోజుల్లో అవసరమైన వేళ ఎలా జగన్ ప్రభుత్వంపై  పోరాడగలుగుతారన్న అనుమానాలు  పార్టీ సహచరుల్లో  వ్యక్తమవుతున్నాయి.

 

చంద్రబాబు ఇలా విసుగూ విరామం లేకుండా చేసే ఆరోపణలు శ్రోతలకు కూడా  మరీ రోటీన్ గా ఉంటున్నాయి. ఉత్తేజం కలిగించని చంద్రబాబు ప్రకటనలు, హుషారులేని ఉపన్యాసాలు, ఉల్లాసం కలిగించని భాష, ఉత్సాహం ఏమాత్రము లేని విషయం, అంతా చంద్రబాబు పట్ల జనాలకు విసుగు ఇప్పుడే కలిగిస్తుండగా – అవి కూడా జనం మనులోకి ఎక్కకపోవటం కారణం కూడా ఇదేనని అంటున్నారు.  సీరియస్నెస్ తగ్గిపోతున్న ఈయన ఉపన్యాసాలు టీడీపీలో ఇతర నేతలలోను కార్యకర్తల్లోను భయం నింపు తుంది. 

 

ఇంకా నాలుగేళ్ళ తర్వాత - వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఉపన్యాసాలు చేవ చచ్చి పోయి చప్పగా తయారవటం తధ్యం.  జగన్ లాంటి ఉడుకు రక్తం ప్రవహించే 'పులిని వేటాడాలంటే మాటు వేసి వేటెయ్యాలి' తప్ప ఇలా నోటికి పని చెప్పి దూల తీర్చుకుంటే పోతే సరైన సమయంలో జావగారి పోకతప్పదు. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: