టెలికం రంగంలో సంచలనం సృష్టించింది ఎవరు అంటే జియో అనే చెప్పాలి. డిజిటల్ ఇండియా అయ్యింది అంటే అది రిలయన్స్ జియో వల్లే అని చెప్పాలి. జియోనే రాకపోయింటే ఇప్పటికి మనం 2017 దగ్గరే ఆగిపోయే వాళ్ళం. అంటే రెండేళ్లు వెనుక పడి ఉండేవాళ్ళం అని ప్రముఖ చానళ్ళు చేసిన సర్వేలో తేలింది. అప్పట్లో ఒక జిబి డేటా వాడాలంటే 159 రూపాయిలు కట్టాలి. కానీ జియో వచ్చాక రోజుకు 1జీబీ ఫ్రీ గా ఇచ్చింది. 


ఉచితంగా కాల్స్ మాట్లాడుకునేకి ఇచ్చింది. ఫ్రీ డేటా, ఫ్రీ మెసెజ్ సర్వీస్, ఫ్రీ కాల్స్ ఇచ్చింది. మొదట అందరూ సిగ్నల్స్ లేవు అది ఇది అన్న తర్వాత అన్ని నెటవర్క్స్ కు మించి మంచి డేటాను, కాల్స్ ను, మెసెజ్ ను ఇచ్చింది. ఇలా అన్ని ఫ్రీ గా ఇచ్చిన ఈ జియో ఒకానొక సమయంలో రాజ్యం ఏలింది. 


అయితే టోయ్ నిబంధనల ప్రకారం కొత్తగా కాల్ చార్జిస్ పరిచయం చేసింది. జియో తో జియో మాట్లాడితే ఫ్రీ అని.. జియో నుంచి వేరే నెట్ వర్క్స్ కి చేస్తే నిమిషానికి 6 పైసలు పడుతుంది అని ప్రకటించారు. దీంతో మొదట నిరాశ పడిన జియో వినియోగదారులు ఇప్పుడు అర్ధం చేసుకొని నడుచుకుంటున్నారు. 


అయితే ఈ నేపథ్యంలోనే జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మరో నెల పాటు వినియోగదారులు బిల్లు చెల్లించనవసరం లేకుండా సంచలన నిర్ణయం తీసుకుంది. గత నెలలో ఐదు లక్షల మంది కస్టమర్లు జియో ఫైబర్ ని రిజిస్టర్ చేయించుకున్నారు. అయితే వారితో పాటు కొత్తగా రిజిస్టర్ చేసుకునేవారితో పాటు ఇతర జియో సేవల పొందుతున్న వారందరికీ ఒకే బిల్లింగ్ సిస్టమ్ ను రూపొందించే పనిలో జియో ఉందట. దీంతో ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. అందుకనే జియో యూజర్లకు మరో నెల పాటు బిల్లింగ్ ఉండదని జియో ప్రకటన ఇచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: