ఆంధ్రప్రదేశ్ లో మీడియా చాలా వరకూ ఓ సామాజిక వర్గం చేతుల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. అందులోనూ ఆ సామాజిక వర్గం మీడియా తమ సొంత సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబును నిత్యం ఆకాశానికెత్తేస్తూ ఉంటుంది. నిరంతం చంద్రబాబు అనుకూల కథనాలు.. చంద్రబాబు వ్యతిరేకులపై అబాంఢాలు వేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు అలాంటి పత్రికలకు ముకుతాడు వేసేందుకు జగన్ పాత కాలం నాటి జీవోను వెలికితీశారు.


గతంలో తన తండ్రి వాడాలని తలపెట్టిన జీవోకే మరింత పదును పెట్టారు జగన్. పత్రికల్లో ప్రభుత్వంపై వచ్చే అవినీతి ఆరోపణలు అవాస్తవాలని రుజువైతే చర్యలు తీసుకోమని ప్రభుత్వ సంస్థల సెక్రెటరీలకు అధికారాలు ఇచ్చిన జీవో ఇప్పుడు ఏపీలో సంచలనం అయ్యింది. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే అంటూ కొన్ని మీడియా హౌజులు గగ్గోలు పెట్టాయి.


అయితే వాటికంటే ఎక్కువగా చంద్రబాబు కంగారు పడ్డాడని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు తుమ్మినా, దగ్గనా, కంటిమీద కురుపేసినా, ముక్కుమీద ఈగ వాలినా బాబు బ్రహ్మాండం అంటూ కాకమ్మ కథనాలు రాసే చంద్రబాబు మిత్ర పత్రికా, ఛానెళ్లకు ఈ జీవో నిజంగా కష్టం కలిగించే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబును తప్ప మరొకరిని ముఖ్యమంత్రిగా ఊహించుకోలేని స్థితిలో కొన్ని తెలుగు మాధ్యమాలు ఉన్నాయన్నది బహిరంగ సత్యం.


వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలన, సీఎం జగన్ పారదర్శక పాలనతో ప్రజలను మెప్పించడం బాబు భజనపరులకు కంటకింపుగా ఉంది. అందుకే వైయస్ జగన్ అధికారం చేపట్టిన క్షణం నుంచే నిరాధారమైన ఆరోపణలతో ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అవినీతి జరిగితే ఏ ప్రభుత్వాన్నైనా ప్రశ్నించే హక్కు, విమర్శించే బాధ్యత మీడియాకు ఉంటుంది.


ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంటున్న తాజా విష ప్రచారంపై కొత్త ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో పూర్తి పారదర్శకత పాటిస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిబంధనలకు లోబడి నిబద్ధతతో పనిచేస్తోందని సీఎం అన్నారు. అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గ్రామ స్థాయి నుంచీ పై స్థాయి వరకూ అవినీతికి తావు లేకుండా ముఖ్యమంత్రి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసారు. రూ. 10లక్షలు దాటిన కాంట్రాక్టును కూడా పారదర్శక విధానంలో చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: