పిజ్జా అంటే అందరికి ఇష్టం ఉంటుంది.  ఇటీవల కాలంలో హాట్ హాట్ పిజ్జాను ఆర్డర్ చేసుకొని లేపేస్తుంటారు.  పిజ్జాలో ఎన్నో వెరైటీలు ఉంటాయి.  వెజ్, నాన్ వెజ్ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి.  అలాంటి పిజ్జాలు ఒక్కోసారి ఇద్దర్ని కలుపుతుంటాయి.  స్నేహం పెంచే విధంగా చేస్తుంటాయి.  మందుబాబులను ఎలాగైతే ఏకం చేస్తుందో.. అలానే పిజ్జా వాళ్ళను కూడా ఒక్కటిగా చేస్తుంది.  అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  


కాగా ఇప్పుడు, ఇలాంటి సన్నివేశం ఒకటి అమెరికాలో జరిగింది.  ఆ ఇద్దరు ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇస్తారు.  ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా.. నిత్యం జిమ్ లో కూడా వర్కౌట్ చేస్తుంటారు.  ఇలా వర్కౌట్ చేసి జిమ్ చేసే ఓ ఇద్దరికీ పిజ్జా అంటే ప్రాణం.  పిజ్జాను తెగ లాంగించేస్తుంటారు. మిగతా ఆహారం కూడా అవసరం లేదు.  పిజ్జా ఉంటె చాలు. అలాంటి ఫిట్నెస్ తో స్నేహం పెంచుకున్న ఆ ఇద్దరు.. పిజ్జాతో దగ్గరయ్యారు.  దగ్గర కావడమే కాదు.. ఇద్దరికీ మధ్య ప్రేమ చిగురించింది.  


పిజ్జా అంటే ఇష్టపడే ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.  ప్రపోజ్ చేయాలనీ అనుకున్నాడు.  అదీ వెరైటీగా.. వెంటనే ఆమె ఇంటికి వెళ్లి విల్ యు మ్యారి మీ అంటూ పిజ్జాపై రాశాడు.  అతను ప్రపోజ్ చేసిన విధానం బాగా నచ్చింది. అంతే కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లి అతనికి ముద్దిచ్చింది.  పెళ్లి చేసుకుంటా అని చెప్పింది.  ఆ క్షణంలో ఇద్దరు ఒక్కటయ్యారు.  


ఇద్దరిని కలిపినా పిజ్జాతో కలిసి ఫోటోషూట్ చేశారు.  అది మాములు ఫోటో షూట్ కాదు.. న్యూడ్ ఫోటోషూట్.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.  ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  ఫోటోలు ట్రెండ్ అవుతుండటంతో.. వారి పేరు మారుమ్రోగిపోతున్నది.  పిజ్జా లవర్స్ గా వాళ్లు పేరు తెచ్చుకోవడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: