పార్టీల్లో కార్మికులు టెన్షన్ పెట్టడం ఏంటి అని షాక్ అవ్వకండి.. రేపు అంటే అక్టోబర్ 21 వ తేదీన హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక జరగబోతున్నది.  ఈ ఉపఎన్నికల్లో తప్పకుండా గెలవాలని తెరాస పార్టీ భావిస్తోంది.  అధికారంలో ఉన్న పార్టీ ఆయా రాష్ట్రాల్లో జరిగే ఉప ఎన్నికల్లో గెలుస్తుంటారు.  అది జరగలేదు అంటే.. ఆ పార్టీపై ప్రజల్లో నమ్మకం తగ్గిపోతుంది అని అనుకుంటూ ఉంటారు.  అందుకే ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు.  


రేపు హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరగబోతున్నది.  ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని తెరాస పార్టీ చూస్తున్నది.  పది రోజుల క్రితం వరకు తెరాస పార్టీ గెలుస్తుందని అందరు అనుకున్నారు.  ఎప్పుడైతే రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి.  తెరాస పార్టీ తరపున ప్రచారం చేయాలి అనుకున్న చాలా మంది నేతలు ప్రచారానికి దూరంగా ఉంటూ వచ్చారు.  


కెసిఆర్ ప్రచార సభ కూడా రద్దయింది.  ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అనేక ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు మద్దతు పలకడంతో పాటుగా రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వడంతో తెరాస పార్టీ అయోమయంలో పడిపోయింది.  పైగా అటు హై కోర్టు కూడా కార్మికుల పక్షాన నిలవడం, వారితో చర్చలు జరపమని చెప్పడం తెరాస పార్టీకి ఇబ్బంది కలిగించే విషయంగా మారింది. 


దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుండటంతో.. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనే విధంగా మారిపోయింది.  రేపటి రోజున జరిగే ఎన్నికల్లో ఓటర్లు ఎవరికీ ఓటు వేయబోతున్నారు అనే టెన్షన్ కంటే.. కార్మికుల టెన్షన్ తెరాస ప్రభుత్వానికి ఎక్కువైంది.  చర్చలకు పిలిచేది లేదని చెప్పడం.. వారిని సెల్ఫ్ డిస్మిస్ చేయడం వంటి అంశాలు తెరాస పార్టీకి ఇరకాటంలో పెట్టాయి.  అసలు డిమాండ్లపై చర్చలకు పిలవకుండా ఇలా చేయడం తగదని కార్మికులు అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: