మోడీ తరువాత అంతటి వాడైన అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. పైగా ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు. రాజకీయ అపర చాణక్యుడు.  మంచి వ్యూహకర్త. జగనే స్వయంగా చెప్పినట్లుగా దేశంలో అత్యంత బలవంతుల్లో షా రెండవ ప్లేస్ లో షా ఉన్నారు. దాంతో ఆయన్ని కలవాలని రాజకీయ పార్టీల నేతలు ఎక్కువగా అనుకుంటారు. ఇక ముఖ్యమంత్రులైతే చెప్పనక్కరలేదు. వారికి రాష్ట్రాల పనులతో పాటు రాజకీయ పనులు కూడా ఉంటాయి.


జగన్ విషయానికి వస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందు అమిత్ షా ను ఒకసారి కలిశారు. సీఎం హోదాలో మరో మారు కలిశారు. ముచ్చటగా మూడవసారి ఇపుడు కలుస్తున్నారు. అమిత్ షా తో జగన్ భేటీ నిజానికి ఈ నెల 14న జరగాల్సి వుంది. కానీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో షా బిజీగా ఉండడంతో కుదరలేదని వాయిదా పడింది. ఇక అమిత్ షా జగన్ కి కావాలనే అపాయింటెమెంట్ ఇవ్వలేదని టాక్ కూడా బయల్దేరింది.


అదే విధంగా బీజేపీలో చేరిన టీడీపీ మాజీలు కూడా అమిత్ షాతో భేటీ కాకుండా అడ్డు పుల్ల వేశారని కూడా ప్రచారం జరిగింది. ఇక ఏపీకి చెందిన కొందరు బీజేపీ నేతలు కూడా షాతో భేటీ జరగకుండా చూశారని పుకార్లు వచ్చాయి. వాటిని ఇపుడు పక్కన పెట్టేలా అమిత్ షాతో జగన్ భేటీ జరగబోతోంది. ఈ నెల 21న అంటే రేపే జగన్ అమిత్ షాను కలవబోతున్నారు.


అమిత్ షాతో భేటీ సందర్భంగా జగన్ ఏ ఏ అంశాలు ముందుకు తెస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ విషయానికి వస్తే విభజన హామీలను నెరవేర్చాలని కోరుతారని అంటున్నారు. అదే విధంగా ఏపీలో రాజకీయ పరిస్థితులు కూడా వివరిస్తారని అంటున్నారు. గత టీడీపీ సర్కార్ అవినీతిని కూడా దేశ హోం మంత్రి ద్రుష్టిలో పెట్టబోతున్నారు. దాంతో టీడీపీ కూడా ఈ భేటీపై చాలా హైరానా పడుతోందని టాక్. మరి చూడాలి ఈ భేటీ ఎన్ని ప్రకంపనలు స్రుష్టిస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: