ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా పడుతున్నాయి. ఇలా వర్షాలు పడటం వల్ల రైతుల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు. అయితే నగరాల్లో ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బందుల పాలవుతున్నారు. రోడ్లు సరిగ్గా లేక వర్షం నీరు ఎక్కడిక్కడ నిలిచిపోతున్నాయి. ఆ వర్షపు నీరు కారణంగా దోమలు వచ్చి మలేరియా, డెంగ్యూ జ్వరాలు తెప్పించి ఆసుపత్రిపాలు చేస్తున్నాయి.  

                

అయితే మొన్నటి వరుకు తగ్గిపోయిన వర్షాలు ఇప్పుడు భారీగా రానున్నాయి. ఈరోజు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చెప్పింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుండటంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.     

                    

అయితే ఈ భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉండటంతో ఈరోజు ఏది మరింత బలపడే అవకాశముంది.     

                     

మరోవైపు ఈశాన్య రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. దీంతో ఈరోజు, రేపు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయిని, అలాగే అక్టోబర్ 22, 23 తేదీల్లో కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.      

                   

మరింత సమాచారం తెలుసుకోండి: