ఇటీవల దేశంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు హానీ ట్రాప్.  మధ్యప్రదేశ్ లో ఈ రకమైన ట్రాప్ ఎక్కువగా జరుగుతున్నది.  రాజకీయ నాయకులను ఇలా ట్రాప్ చేస్తున్నారు అందమైన ముద్దుగుమ్మలు.  ఈ ట్రాప్ లో చిక్కుకున్న నాయకులు పాపం ఇప్పుడు విలవిలలాడిపోతున్నారు.  మనీ ట్రాప్ లో చిక్కుకునే వ్యక్తులకు సంబంధించిన చాలా విషయాలను పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు.  జాగ్రత్తగా ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా అమ్మాయిలను చూసిన మోజులో పడి ఉన్నవన్నీ వదిలించేసుకుంటున్నారు.  


ఇదిలా ఉంటె, ఇలాంటి హనీ ట్రాప్ లు మధ్యప్రదేశ్ లోనే కాకుండా హైదరాబాద్ లో కూడా జరుగుతున్నాయి.  అలాంటి వాటిల్లో ఒకటి ఇటీవలే జరిగింది.  అతను  ఓ మత ప్రచారకుడికి 25 ఏళ్ల మహిళ పరిచయం అయ్యింది. ఆమెను సికింద్రాబాద్ లో ఓ అనాధశరణాలయం నడిపే మహిళగా పరిచయం చేసుకుంది.  అనేకసార్లు అతనితో వాట్సాప్ లో మాట్లాడింది.  ఫోన్ చేసి మాట్లాడింది.  ఇలా ఎన్నోసార్లు పరిచయం చేసుకుంది.  


ఓసారి హరిణి పార్కు దగ్గరలోనే ఓ రెస్టారెంట్ లో భోజనానికి పిలిచింది.  ఆ తరువాత ఆమెనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రెస్టారెంట్ లో భోజనానికి పిలిచింది.  రెండు చోట్ల డిన్నర్ ఇచ్చే సరికి ఆమెతో చనువు ఏర్పడింది.  అక్కడి నుంచి ఇద్దరు కలిసి వండర్ ల్యాండ్ కు వెళ్లారు.  అక్కడ చనువుగా ఉన్నారు.  ఇద్దరు కలిసి సెల్ఫీ దిగారు.  ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు. దాన్ని ఆమె అడ్వాంటేజ్ గా తీసుకొని తన భర్త  చేస్తున్నారని డబ్బు కావాలని కోరింది.  మరేమి ఆలోచించకుండా పదిలక్షలు ఇచ్చాడు.  


ఆ తరువాత  వాళ్ళు శంకర్ పల్లిలోని ఓ రిసార్ట్ కు రమ్మని చెప్పడంతో.. ఆ మతప్రచారకుడు వెళ్ళాడు.  అక్కడికి వెళ్లిన ఆ మతప్రచారకుడు.. ఆమెతో కలిసి చనువుగా ఉన్నాడు.  అదే సమయంలో ఆమె మద్యంలో మత్తు బిళ్ళలు ఇవ్వడంతో.. మత్తులో పడిపోయాడు.  అనంతరం అతనితో కలిసి ఆ మహిళా చనువుగా ఉన్నట్టుగా ఫోటోలు దిగింది.  ఆ తరువాత ఆమె భర్త వచ్చి బెదిరించడంతో షాక్ అయ్యాడు.  కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు.  అప్పటికే ఆ మతప్రచారకుడు మరో పదిలక్షల రూపాయలు ఇచ్చాడు.  కానీ రోజు రోజుకు వల్ల ఆగడాలు ఎక్కువ కావడంతో.. చేసేదిలేక పోలీసులకు ఆశ్రయించాడు.  పోలీసులు చాకచక్యంగా ఆ మాయలేడిని పట్టుకున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: