కోహినూర్ వజ్రం మన హైదరాబాద్ కు ఎంతో కీర్తి తెచ్చి పెట్టింది. వజ్రాలకు నిలయమైన తెలంగాణాను వజ్రాల తెలంగాణా అనాలి కాని బంగారు తెలంగాణ అనిఏ ముహుర్తాన అన్నారో కానీ, అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అసలు తెలంగాణా గురించి ప్రస్తావన వస్తే చాలు, "బంగారు తెలంగాణ" అనేది ఒక నామ విశేషణం గా మారిపోయింది. అయితే ఇప్పుడు బంగారు తెలంగాణను కాదు, “వజ్రాల తెలంగాణ” పిలవాలి. 

ఇదేదో రాజకీయ నేతలు చెబుతున్న విషయం కాదు. అక్షరాలా నిజమే కాబోతోంది. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో బంగారు గనులతో పాటు వజ్ర నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఇక వాటిని వెలికి తీయడమే తరువాయి – బంగారు తెలంగాణా లోని బంగారు ని కేసీఆర్  బంగారు కుటుంబానికి వదిలేసి మన జన తెలంగాణాని “వజ్రాల తెలంగాణ” అంటూ మన కల సాకారం చేసుకుందాం అంటున్నారు మైనిగ్ నిపుణులు. 
Image result for Diamond Mines in Telangana
బంగారు తెలంగాణలో గోల్డ్ నిల్వలు బాగానే ఉన్నట్లు తేలింది. ఆరు జిల్లాల్లో భారీగా బంగారు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు మైనింగ్ శాఖ అధికారులు. అదే క్రమంలో వజ్రనిక్షేపాలు కూడా అంతకు మొంచిన ఉన్నట్లు గుర్తించారు. ఆ మేరకు బంగారు అన్వేషణ ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. గోల్డ్-మైన్స్ తవ్వి బంగారు నిల్వల వెలికితీతకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నల్గొండ, సూర్యాపేట, పాలమూరు, గద్వాల, వనపర్తి, నాగర్‌ కర్నూల్ జిల్లాల్లో గోల్డ్ మైన్స్‌తో పాటు వజ్రనిక్షేపాలు నిండుగా ఉన్నట్లు తేలింది.

బంగారు గనులు, వజ్రనిక్షేపాలకు సంబంధించి తెలంగాణ గనుల శాఖ ఇటీవల ఒక నివేదికలో బంగారు, వజ్రాల నిల్వలపై పలు అంశాలను నివేదించటమే కాకుండా భవిష్యత్ లో తీసుకోబోయే చర్యలను వివరించాయి. ఈ నివేదిక ప్రకారమే తెలంగాణ ఆరు జిల్లాల్లో గోల్డ్ మైన్స్‌తో పాటు డైమండ్ నిక్షేపాలు ఉన్నాయనే విషయం తెలిసింది. దాంతో సమగ్ర సర్వే చేయాలంటూ 'జాతీయ గనుల అభివృద్ధి మండలికి  ఎన్‌ఎండీసీ' కి బాధ్యతలు అప్పగించారు. ఆ క్రమంలో బంగారం నిల్వలకు సంబంధించి తొలి దశ కింద వనపర్తి, గద్వాల జిల్లాల్లో సర్వే నిర్వహించాలని భావిస్తున్నారు.
Image result for Diamond Mines in Telangana
తెలంగాణ గనుల శాఖ సూచించిన విధంగా, ఎన్‌ఎండీసీ అధికారులు ప్రాథమిక సమాచారం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ధారూర్‌, ఆత్మకూర్ ప్రాంతాల్లో డ్రిల్లింగ్ నిర్వహించి ఆరు జిల్లాల్లో బంగారు, వజ్రాల నిల్వలు ఉన్నట్లు గుర్తించినప్పటికీ, ఎన్‌ఎండీసీ సమగ్ర సర్వే నివేదిక ఇచ్చాక గానీ అసలు విషయం తెలుస్తుందనేది ఇప్పటికున్న సమాచారం. ఆ నివేదిక వచ్చిన తర్వాతే ఈ గనుల తవ్వకాలపై ఏం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
Image result for kohinoor diamond in british museum
గనులు తవ్వాలంటే అధిక ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం అందుకే ఆయా ప్రాంతాల్లో మైనింగ్ గనక చేస్తే ఎంత మేర మనకు ఆదాయాన్ని ప్రయోజనాన్ని ఇచ్చే బంగారం వెలికితీయ గలం అనే విషయంపై తవ్వకాలు ఆధారపడి ఉంటాయి. ఆ మేరకు నాణ్యత, మేలిమి తెలుసుకోవటానికి పరీక్షలు కూడా చేయిస్తారు. తవ్వకాలు తది తర ఖర్చులు పోను “వాల్యూ బేస్డ్ గోల్డ్” వస్తేనే గనుల్లో నుంచి బంగారం వెలికితీస్తారు. లేదంటే తేలికగా తీసుకుంటారు.

తెలంగాణ పలు ప్రాంతాల్లో వివిధ రకాల మినరల్స్‌ను పూర్తిస్థాయిలో వెలికితీయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దాంతో భారీ ఆదాయం సమకూర్చుకోవాలన్నది దాని ప్రణాళిక. ఇప్పటికే లైమ్‌స్టోన్, బొగ్గు గనుల ద్వారా తెలంగాణ ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతోంది. ఆ క్రమంలో ముడి సరుకు లను వెలికితీయడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగు పడతాయనేది ప్రభుత్వం ఆలోచన. 
 Image result for kohinoor diamond in british museum

మరింత సమాచారం తెలుసుకోండి: