మోడీ అంటే గిట్టని వారు పెట్టే పేరు మొండి అని. ఆయన పన్నెండేళ్ళు గుజరాత్  ని పాలించినా ఇపుడు సువిశాల దేశాన్ని రెండవమారు ఏలుతున్నా ఆయన వైఖరి ఎపుడూ మారలేదు. గుజరాత్ సీఎం గా ఎలా ఉన్నారో భారత ప్రధానిగా అలాగే ఉన్నారు. మోడీ ఓ విధంగా రాజకీయాలు అతీతంగా ఉంటారనిపిస్తుంది. రాజకీయాల్లో రాగద్వేషాలు లేవంటారు. కానీ మోడీకి అనురాగం ఉంది.ద్వేషం కూడా అంతే ఉంది. ఆయన అన్నీ గుర్తు పెట్టుకుంటారు. సరైన సమయం రాగానే వడ్డీతో సహా బదులిచ్చేస్తారు.


ఇపుడు అదే బెంగ ప్రత్యర్ధి రాజకీయ పార్టీలో ఉంది. మోడీ ముందు ఇపుడు రెండు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. మహారాష్ట్ర, హర్యానా, ఈ రెండింటిలో అయిదేళ్ల క్రితం బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఆరు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా ఈ రెండు రాష్ట్రాలు బీజేపీకి మద్దతు పలికి జై మోడీ అనేశాయి. హర్యానాలో అయితే పదికి పది ఎంపీ సీట్లు బీజేపీ పరమాయ్యాయి. ఇక 48 ఎంపీ సీట్లు ఉన్న మహారాష్ట్రలో కూడా మూడొంతులకు పైగా సీట్లు బీజేపీకే జై కొట్టేశాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మరో మారు బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు. ప్రీ పోల్ సర్వేలు కూడా ఇదే విషయం స్పష్టం చేశాయి.


అంతా అనుకుంటున్నట్లుగా ఈ రెండు స్టేట్స్ బీజేపీకి ఓ విధంగా ప్రతిష్టగా ఉన్నాయి. ఇక్కడ కనుక మళ్ళీ గెలిస్తే మోడీని పట్టడం కష్టమేనని అంటున్నారు. మోడీ ఇక ముందుకు దూసుకుపోతారని కూడా చెబుతున్నారు. ఈ దేశంలో మళ్ళీ మళ్లీ గెలిచేలా మోడీ తనదైన‌ రాజకీయం మొదలుపెడతారని, అది ప్రతిపక్షాలకు ప్రాణ సంకటంగా మారుతుందని కూడా అంటున్నారు. మోడీ అజేయుడుగా ఇలా పెరిగిపోవడం దేశంలోని విపక్షాల వినాశకానికేనని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి మోడీ మొండోడు అయినా, దూకుడుగా వ్యవహరించినా కూడా పుట్టి మునిగేది కచ్చితంగా దేశంలోని ప్రతిపక్ష కూటమికే. ఆ సంగతి ముందే తెలిసిన వారంతా సర్దుకుంటున్నారు, గొంతు కూడా సవరించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: