రాజకీయాల్లో ఎపుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు అంటారు. ఎందుకంటే అదొక క్రీడా రంగం, అక్కడ ఎత్తులు, పై ఎత్తులు ఉంటాయి, వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఉంటాయి. ఒకటి అనుకుంటే వేరొకటి జరుగుతుంది. అదే విధంగా మంచి అనుకుంటే చెడ్డా కూడా జరగొచ్చు. ఎవరైతే శత్రువులు అనుకుంటారో వారే స్నేహ హస్తం చాచవచ్చు. ఇదిలా ఉండగా ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల మీద అందరి ద్రుష్టి ఉంది.


ఏపీలో కొత్త పాలకుడుగా జగన్ వచ్చారు కానీ, తెలంగాణాకు పాత ఏలికే ఉన్నారు. ఇక జగన్ సీఎం అయిన తొలినాళ్ళలో కేసీయార్ తో యమ దోస్తీ కొనసాగింది. ఇద్దరి మధ్య మంచి బాండేజి కూడా ఉన్నట్లుగా అనిపించింది. అయితే రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు అనేకం ఉన్నాయి. అవి స్నేహాన్ని చిద్రం చేసే స్థాయిలోనే ఉన్నాయి. అదే సమయంలో ఏపీలో జగన్ మీద కేసీయార్ తో దోస్తీపై విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో దాని వల్ల ఏపీకి పెద్దగా ఒనగూడినది లేదని కూడా అభిప్రాయం వ్యక్తం  అవుతోంది. దీంతో ఇద్దరు సీఎంలు  అనుకున్న కొన్ని కీలకమైన ప్రాజెక్టులు కూడా ఇపుడు వెలుగు చూసే అవకాశాలు లేవని వినిపిస్తోంది.


అందులో ఒకటి గోదావరి మిగులు జలాలను క్రిష్ణా నదికి  ఉపయోగించుకుని అటు తెలంగాణా, ఇటు రాయలసీమ ప్రాంతాలకు నీటిని అందించడం, ఎత్తిపోతల దాకా కొసవరకూ నీరు తీసుకుపోవడం. లక్ష కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేయాలంటే రెండు రాష్ట్రాల వద్ద సొమ్ము లేదు. పైగా తెలంగాణా భూ భాగం మీద ప్రాజెక్ట్ నిర్మాణం జరగడం అంటే ఏపీలోని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో జగన్ తాజాగా ఆ ప్రతిపాదన విరమించుకున్నారా అన్న చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ డిసెంబర్  ఇరవై ఆరున గోదావరి -పెన్నా లింక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్న నేపద్యంలో ఈ వార్త‌లు వస్తున్నాయి. ఏపికి సంబందించిన రిటైర్డ్ ఇంజనీర్లు పోలవరం నుంచి రాయలసీమకు పెన్నా డెల్టా ద్వారా లిప్ట్ ల ద్వారా తరలించవచ్చని,ఇందుకు అయ్యే వ్యయం కూడా తక్కువేనని వివరిస్తున్నారని, వాటిని పరిగణనలోకి తీసుకున్న జగన్ గోదావరి-పెన్నా స్కీమ్ డిపిఆర్ లు తయారీకి ఆదేశాలు ఇచ్చారని సమాచారం.


లిప్ట్ లు, కాల్వలు, గొట్టాల ద్వారా ఈ స్కీమును అమలు చేయవచ్చని, తద్వారా  ప్రకాశం,నెల్లూరు,రాయలసీమ జిల్లాల మెట్ట ప్రాంతాలకు నీరు ఇవ్వవచ్చని ఆలోచన చేస్తున్నారని మీడియాలో కదనాలు వచ్చాయి. అంటే ఓ విధంగా జగన్ తాను కేసీయార్ తో అనుకున్న ప్రాజెక్ట్ కు నమస్కారం పెట్టినట్లేనా అని కూడా అంటున్నారు. నిధుల కొరత నేపధ్యంతో పాటు, రాజకీయ కారణాలు కూడా తెలంగాణా, ఆంధ్ర ఉమ్మడి ప్రాజెక్ట్ కి ఆటంకంగా మారాయని అంటున్నారు. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: