తెలంగాణలో నేడు హుజూర్నగర్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అయితే హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు . ఓటర్ లే కాకుండా వివిధ ప్రముఖులు కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. కాగా ఇప్పటికే ఎన్నికల తేదీ విడుదలైనప్పటి నుంచి అన్ని పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు సర్వ ప్రయత్నాలు చేసాయి . ఇక ఇక అన్ని పార్టీల భవితవ్యం నేడు ఓటర్లు తేల్చనున్నారు. 

 

 

 

 అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికలో  టిఆర్ఎస్ పార్టీ తరఫున సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్  పద్మావతి బిజెపి తరఫున రామారావు టిడిపి తరఫున చావా కిరణ్మై అభ్యర్థులు గా ఉన్నారు. అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపుని  అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి . కాగా నేడు హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పుడు వరకు 33 శాతం వరకు పోలింగ్ పూర్తయినట్లు అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే అన్ని చోట్లా ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కాగా  నియోజకవర్గంలోని మేళ్లచెరువు 133వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం  మొరాయించింది. దీంతో వెంటనే అధికారులు మరో ఈవీఎం ని ఏర్పాటు చేశారు. ఇక ఆ ఈవీఎం కూడా పని చేయకుండా మొరాయించడంతో ఆ బూతులో  పోలింగ్ నిలిపివేశారు  అధికారులు . అయితే సత్వర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి యత్నిస్తున్నారు అధికారులు. 

 

 

 

 అయితే ఈ హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో మొత్తం 2,36,842 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇక వీరి కోసం 302 పోలింగ్ కేంద్రాలు 1708 ఈవీఎం లను  ఏర్పాటు చేశారు అధికారులు. అయితే నేడు ఉదయం ప్రారంభమైన పోలింగ్ ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అయితే హుజూర్నగర్ ఉప ఎన్నికలు 79 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు అధికారులు. ఆయా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెబ్ క్యాస్టింగ్ ను ఏర్పాటు చేశారు అధికారులు. కాగా నేడు పోలింగ్ నిర్వహించబడుతున్న హుజూర్నగర్ ఉపఎన్నికల  ఫలితాలు ఈనెల 24న వెల్లడి కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: