ఒకవైపు ఎన్నికల పోరు, మరో వైపు ఆర్టీసీ సమ్మె. ఇప్పుడున్న పరిస్దితుల్లో విజయం ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టంగా మారింది. ఇక ఇప్పటికే ప్రజల మద్దతుతో హుజూర్‌ నగర్‌లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని టీఆర్‌ఎస్ శ్రేణులు ధీమాగా ఉన్నారు. ఇక్కడ విజయం సాధించి ప్రతిపక్షాలకు మరోసారి చెంపపెట్టులా సమాధానం ఇవ్వాలని కార్యకర్తలు ఉవ్విళ్లూరుతున్నారట. ఇకపోతే ఇక్కడ 2 లక్షల 36 వేల 842 మంది ఓటర్లున్నారు. ఈ స్థానంపై అందరి దృష్టి నెలకొంది. ఓటర్ ఎలాంటి తీర్పునిస్తాడోనన్న టెన్షన్ ప్రతి పార్టీ నేతల్లో కనిపిస్తోంది.


ఇక టీఆర్ఎస్ పార్టీ తరపున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలో ఉన్నారు. ఇక టీడీపీ, బీజేపీ పార్టీలు తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో కంచు కోటను కాపాడుకొనేందుకు కాంగ్రెస్, తొలిసారి గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఒకరకంగా ఈ పోరు ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.. మరి ఓటర్ ఎవరి వైపు మొగ్గు చూపుతాడో తెలుసు కోవాలంటే అక్టోబర్ 24వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. 


ఇకపోతే తెలంగాణలో జరుగుతున్న ఏకైక ఉప-ఎన్నిక కావడంతో హుజూర్‌నగర్‌‌లో గెలుపును ఇప్పటికే అన్ని పార్టీలూ సవాల్‌గా తీసుకున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో  హుజూర్‌నగర్‌లో ఉదయం 9 గంటల వరకు 13.44 శాతం ఓటింగ్ నమోదు కాగా 133 వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఓటింగ్‌ నిలిచిపోయింది. ఇక కొనసాగుతోన్న హుజూర్‌నగర్ ఉప-ఎన్నిక పోలింగ్. ఉదయం 11 గంటల వరకు 31.34 శాతం  ప్రశాంతంగా నమోదు జరిగింది. ఇకపోతే కీతవారిపాలెంలో బీజేపీ అభ్యర్థి కోట రామారావు తన ఓటు హక్కును వినియోగించకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: