తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 17వ రోజుకు చేరుకుంది. తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపిన అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. ప్రభుత్వం కార్మికుల డిమాండ్లపై  నిరంకుశ వైఖరిని అవలంభిస్తోందని... కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటూ  నిరసన తెలుపుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఈ నేపథ్యంలో సమ్మెకు మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన కాంగ్రెస్ నేతలు అందరిని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 

 

 

 

 

 ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం నుంచి పోలీసులు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అయినా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయడానికి గాలింపు చర్యలు చేపట్టారు. ఇక తాజాగా రేవంత్ రెడ్డి పోలీసులను తప్పించుకుని ప్రగతి భవన్ ముట్టడికి యత్నం ప్రయత్నం చేయగా... పోలీసులు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశారు. దీంతో ప్రగతిభవన్ గోడలు కూల్చేస్తామంటూ కార్మికులకు న్యాయం చేయాలని  రేవంత్ రెడ్డి కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హైదరాబాదులోని ప్రగతి భవన్ చేరుకునేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎవరూ ఊహించని విధంగా బైక్ పై రేవంత్ రెడ్డి రాగా  పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

 

 

 

 

 ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి కూడా ఓ ఆటోలో ప్రగతి భవన్ ముట్టడికి వచ్చారు. పోలీసులను తప్పించుకొని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ప్రగతి భవన్ ముట్టడికి రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడికి సమీపంలోని ఓ హోటల్ కు  చేరుకున్న జగ్గా రెడ్డి ఆ తర్వాత ఆటోలో ప్రగతి భవన్ కు బయల్దేరారు. అయితే ఆయనను  గమనించిన పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి  మాట్లాడుతూ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రగతి భవన్ ముట్టడి చేసి నిరసన తెలుపుతామని  జగ్గా రెడ్డి స్పష్టం చేశారు. కోర్టు  ఆదేశాలను కూడా లెక్కచేయని సర్కార్ ... తమ తీరుతో  ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తుందని జగ్గా రెడ్డి అన్నారు . రాష్ట్రంలో పోలీసులు పాలన నడుస్తోందని మండిపడ్డారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: