కార్మికుల సమ్మె వల్ల టీఎస్ ఆర్టీసీ రోజుకు సుమారు 10 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ అంచనా ప్రకారం, ఏడాదికి రూ.1200 కోట్ల నష్టంతో కొనసాగుతున్నట్టు సమాచారం. దానికి తోడు రూ. 5వేల కోట్ల రుణభారం ఉంది.  కార్ముకలకు జీతాలు చెల్లించాటకే రూ.224  కోట్లు కావాల్సి వస్తుందిని అడ్వాకేట్ జనరల్ హై కోర్టుకు చెప్పడం విశేషం. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సమ్మె మరింత ఉధృతం అవ్వడం అన్ని వర్గాల్లో ఆందోళన పెంచుతోందని ప్రతిపక్ష పార్టీలు వాపోతున్నాయి.  సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా ఉద్యోగాలు తొలగిస్తామని అనడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతుంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వానికి సంబంధించిన సమస్యగా చూడ కూడదంటున్నారు. తెలంగాణాలోని సామాన్యులందరి సమస్య అని విద్యార్దులు అంటున్నారు.



నష్టాలకు కారణం కార్మికులే అంటూ ప్రభుత్వవర్గాలు ఆర్టీసీ కార్మికుల మీద నిందలు వేస్తుంటే, కార్మికులు మాత్రం మావల్ల నష్టాలు లేవు. ప్రభుత్వ విధానాలే దీనికి కారణం అంటున్నారు. వాస్తవానికి ఆర్టీసికి 50 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. 3 వేల కోట్ల రూపాయల నష్టం ఆర్టీసికి పెద్ద కష్టమేం కాదు.ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేది జెఎసి ప్రధాన డిమాండ్‌. కాని ప్రభుత్వ వర్గాలు విలీనం సాధ్యం కాదు అంటున్నాయి. పక్క రాష్ట్రంలోని ఎపిఎస్‌ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు అక్కడి ముఖ్యమంత్రే ప్రకటించారు. అక్కడ సాధ్యమయింది. ఇక్కడ ఎందుకు కాదు? ఏపీ అప్పుల రాష్ట్రం అయినా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.. మరి..ఏపీతో పోల్చి చూస్తే తెలంగాణ ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది, ఎందుకు విలీనం చెయ్యలేకపోతున్నారు అని కార్మిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.




అంతేకాకుండా ఆర్టీసి సజావుగా నడవాలంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో మాదిరిగా, అన్ని రకాల పన్నులమీద మినహాయింపు ఇవ్వాలని డిమాండే చేస్తున్నారు.  2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు 1 లీటర్‌ డీజిల్‌ ధర 54 రూపాయలు. 5 ఏండ్ల తరువాత 2019లో లీటర్‌ డీజిల్‌ ధర 77 రూపాయలు. అంటే 1 లీటర్‌ డీజిల్‌ కి 23 రూపాయలు రేటు పెరగడం వల్ల ఆర్టీసిపై సుమారు 6 వేల కోట్ల రూపాయలు అదనపు భారం పడింది. ఇతర రాష్ట్రాలలో డీజిల్‌ మీద పెరుగుతున్న భారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలే భరించటం వల్ల అక్కడున్న ఆర్టీసిలు కొంతమేరకు నష్టాన్ని తగ్గించుకోగలుగుతున్నాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ మరింత ఇబ్బందుల్లో కూరుకు పోకుండా,  ప్రభుత్వం సంయమనంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: