కొన్ని రోజుల దసరా సెలవల తర్వాత నేటి నుంచి మళ్లీ తెలంగాణా రాష్ట్ర విద్యాసంస్థలు ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే.. కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం విధుల్లోకి పయనమైన ఉపాధ్యాయులు, విద్యార్థులకు బస్సుల కొరత ఏర్పడనుంది. ఆర్టీసీ సమ్మె కావడంతో ఇన్ని రోజులూ స్కూల్ బస్సులను ప్రయాణికుల కోసం వాడిన తెలంగాణా ప్రభుత్వం.., పాఠశాలలు పునః ప్రారంభమవడంతో., దాదాపు వెయ్యి స్కూల్ బస్సులను తిరిగి స్కూళ్లకు పంపింది. ఇన్ని రోజులు స్కూల్ బస్ డ్రైవర్లు ఆర్.టి.సి. ఆధ్వర్యంలో పనిచేయగా..,, ఇప్పుడు డ్రైవర్లు కూడా తిరిగి స్కూళ్లకు చేరుకున్నారు. 

 

దానివల్ల నేటి నుంచీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులకు మరింత కొరత ఏర్పడనుంది. ఇక ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. కానీ! కొంత మంది స్కూల్, కాలేజీ పిల్లలు కూడా ఆర్టీసీ బస్సుల్లో వెళ్తుంటారు., ఇప్పుడు వాళ్లకు కూడా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడం కాస్త ఇబ్బందే మరి. సమయానికి బస్సులు దొరుకుతాయో లేదో అన్న మాటను పక్కన పెడితే..,, అసలు విద్యార్థుల బస్ పాస్‌లను అనుమతిస్తారో లేదో అనే టెన్షన్ కూడా ఉంది. ఇక గ్రామాల్లో బడులకు వెళ్లే చిన్నారుల పరిస్థితి ఇంకా దారుణం.

 

ప్రతీ సంవత్సరం కంటే ఈసారి తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవుల్ని ఎక్కువ రోజులే ఇచ్చింది. 14న మొదలవ్వాల్సి ఉన్నా స్కూళ్లు., సమ్మె వలన 19 వరకూ వాయిదా వేసింది. 20న ఆదివారం కావడంతో.., మొత్తం 23 రోజులు విద్యాసంస్థలు మూతపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బస్సుల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్నారని ఓ అంచనా. ఇప్పటివరకూ జరిగిన సమ్మె ప్రభావం ఒక ఎత్తైతే ఇక నుంచి మరో ఎత్తు.. 

 

తెలంగాణలో 10వేల వరకూ ఉన్న బస్సులు.. ప్రస్తుతం 3 వేలకు మించి తిరగట్లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం వారు స్కూల్ బస్సుల సాయంతో 6వేల బస్సుల్ని నడపగా., స్కూల్ బస్సులన్నీ స్కూళ్లకు వెళ్లిపోయాయి, డ్రైవర్లు కూడా లేరు... అసలిప్పుడు ప్రయాణికులకు కలిగే ఇబ్బందుల మాటేంటి..?? సమ్మె ఇలాగే కొనసాగితే... ఇక ప్రజల్లో ఉద్యమాలు మొదలవుతాయనే మాట ప్రభుత్వం గుర్తించాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: