పండుగ సీజన్ వచ్చింది.. ఇ కామర్స్ లో వెబ్ సైట్స్ చాలా వరకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తక్కువ ధరకే కావాల్సిన వస్తువులు ఇస్తామని అదరగొడుతున్నారు.  దీంతో చాలా వరకు మాములు షాపులు మూతపడుతున్నాయి.  ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసుకోవడం వలన ఇంటికి అన్ని వచ్చేస్తున్నాయి.  ఇలా అన్ని ఇంటికి వస్తుండటంతో బయటకు కదలడంలేదు.  దీనివలన ఇ కామర్స్ వాళ్లకు ఆదాయం.. వినియోగదారులకు రోగాలు ఖాయం.  


ఇదిలా ఉంటె, ప్రస్తుతం మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.  ఈ ఎన్నికల హడావుడి తక్కువగా ఉన్నది.  మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నా... పోలింగ్ వద్ద పెద్దగా హడావుడి కనిపించడం లేదు.  జనాలు తక్కువగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు.  ఇక ఇదిలా ఉంటె, ముంబైలోని లాల్ బాగ్ లోని ఓ చిన్న బేకరీ దుకాణం ఓ పెద్ద అఫర్ ను ప్రకటించింది.  మాములుగా చెప్పాలి అంటే అది పెద్ద సాహసం కాదు. చిన్నదే.  


ఆ చిన్న దుకాణం ఆఫర్ ను ప్రకటించడం అంటే సాసహం చేసినట్టే అని చెప్పాలి కదా మరి.   ఈ ఎన్నికల్లో ఓటు వేసి..వచ్చిన వ్యక్తులకు అరకిలో కేక్ ను కేవలం రూ. 99 రూపాయలకే ఇస్తున్నట్టు ప్రకటించారు.  ఈరోజుల్లో మాములు కేకు ధర కనీసం మూడు వందల రూపాయల వరకు ఉంటుంది.  అరకిలో అంటే కనీసం రూ. 150కి పైగా ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నా వినియోగదారులకు లాభం అని చెప్పాలి.  


మరి తక్కువ ధరకు కేకు ఎందుకు ఇస్తున్నారు అంటే.. పోలింగ్ శాతం పెంచడంతో పాటు షాప్ ప్రమోషన్ చేసుకున్నట్టుగా ఉంటుందని అంటున్నారు.  ఏది ఏమైతేనేం..ఎన్నికలవేళ వినూత్నమైన ఆఫర్లు ప్రకటించే వాళ్లకు తప్పకుండా మంచి ప్రమోషన్ దొరుకుతుంది.  ఒక్కసారి ప్రమోషన్ అయ్యింది అంటే.. షాప్ కు జనాలు వస్తారు.  వ్యాపారం పెరుగుతుంది.  ఇప్పుడు తక్కువ ధరకు ఇచ్చినా... ఫ్యూచర్ లో అమ్మకాలు పెరుగుతాయి.. అంతకంటే కావాల్సింది ఏముంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: