మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక మద్యం టీ కొట్టులో దొరుకుతుందని, కిరాణం కొట్టులో దొరుకుతుందని, వైసీపీ నాయకుల ఇళ్లలో దొరుకుతుందని అన్నారు. వైసీపీ నవరత్నాలు నవగ్రహాలుగా మారాయని చంద్రబాబు అన్నారు. పల్నాటి పులి కోడెలను వైసీపీ పార్టీ నాయకులు అక్రమ కేసులు పెట్టి వేధించి చంపారని చెప్పారు. 
 
రుణమాఫీ నాలుగో విడత, ఐదవ విడత డబ్బులు తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసినా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. పోలవరం 71 శాతం పూర్తి చేశానని ఆంధ్రప్రదేశ్ కు నీటి ఎద్దడి లేకుండా చేద్దామని ప్రణాళిక వేశానని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంది రివర్స్ టెండరింగ్ కాదని రివర్స్ డెవలప్ మెంట్ అని అన్నారు. ప్రభుత్వం 750 కోట్ల రూపాయలు ఆదా అయిందని చెబుతుందని కానీ 7500 కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని అన్నారు. 
 
వైసీపీ ప్రభుత్వం వాటర్ ట్యాంకులకు, అంగన్ వాడీ కేంద్రాలకు కూడా వైసీపీ జెండా రంగులు వేసిందని చంద్రబాబు అన్నారు. గ్రామ సచివాలయం ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకు ఇచ్చారని, ప్రశ్నాపత్రం టైప్ చేసిన అమ్మాయికి పరీక్షలో టాప్ ర్యాంక్ వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఉద్యోగాలు రావాలి అంటే పరిశ్రమలు రావాలని అన్నారు. ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే వస్తుందని చంద్రబాబు అన్నారు. 
 
 వైసీపీ ప్రభుత్వానికి ధైర్యముంటే ఎదుర్కోవాలని మీడియాకు షరతులు పెట్టవద్దని అన్నారు. మన రాష్ట్రంలోని ఇసుకంతా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కి తరలిపోతుందని మనకు మాత్రం దొరకటం లేదని చంద్రబాబు అన్నారు. 32 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం ప్రజలను విద్యుత్ కోతలతో ఇబ్బందులు పెడుతోందని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో ఒక్క నిమిషం కూడా కరెంట్ లేకుండా ఉన్న సందర్భం లేదని చంద్రబాబు అన్నారు. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: