రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడిని చదివిద్దాం...ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షను నెరవేరుద్దాంమని అంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మరియు వినియోగదారుల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) పిలుపు నిచ్చారు. ఈ నెల 22 తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా తనకు  శుభాకాంక్షలు తెలపాలని వచ్చే ప్రజలకు ,అభిమానులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులకు మంత్రి నాని విజ్ఞప్తి చేశారు. సోమవారం కృష్ణా జిల్లా గుడివాడలోని తన కార్యాలయంలో జరిగిన పత్రిక సమావేసంలో మంత్రి నాని మాట్లాడారు. తన జన్మదిన వేడుకలు కన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళటం మన అందరి కర్తవ్యంగా తాను భావిస్తున్నానని చెప్పారు.



ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడు చదువు కోవాలనే ముఖ్యమంత్రి ఆకాంక్షలో మనం సైతం ముందుకు కదలాలన్నారు. ఈ క్రమంలో జన్మదిన  శుభాకాంక్షలు తెలపాలని వచ్చే ప్రజలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు పువ్వుల దండలు, బోకెలు స్వీట్లు, కేకులతో  తన దగ్గరకి వస్తారని అన్నారు. ఆ చర్యలతో  కేవలం ఆ రోజుకు మాత్రమే ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పారు. అభిమానులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాటికి బదులుగా పుస్తకాలు, పెన్నులు, రైటింగ్  ప్యాడ్ లు  తీసుకుని వస్తే వాటిని చదువుకునే ప్రతి పేద విద్యార్థి కి  అందించవచ్చని మంత్రి నాని అభిప్రాపడ్డారు. ప్రతి పేద వాడు ఉన్నత చదువులు చదువుకుంటే  పేద కుటుంబాల జీవితాలలో అనందాలు వెల్లువిరుస్తాయన్నారు.   



ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పం మనందరికి  నిజమైన ఆనందమని చెప్పారు. మంత్రి కొడాలి నాని మంత్రి హోదాలో తొలి  పుట్టిన రోజును ఈనెల 22వ తేదీన జరుపుకుంటున్నారు. అయితే పుట్టిన రోజు వేడుక స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆకాక్షిస్తున్నారు. ఆ మేరకు విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా చర్యలు చెప్పారు.  అభిమానులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పటికే భారీ ఎర్పాటు చేసుకున్న తరుణంలో మంత్రి కొడాలి నాని ప్రకటన నిరాశపరిచింది. అయితే ఒక ఉన్నతమైన ఆశయంతో సీఎం జగన్ అడుగుజాడల్లో తమ నాయకుడు నడవటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: