మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందనుకున్న సమయంలో అనుకోని ఘటన జరిగింది.. మధ్యాహ్నం ఓ అభ్యర్థిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు దిగడం సంచలనం సృష్టించింది. అంతేగాకుండా ఆయన ప్రయాణిస్తున్న కారును సైతం తగులబెట్టారు. ఐతే అభ్యర్థి సురక్షితంగా బయటపడ్డారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో కాంగ్రెస్ మిత్రపక్షమైన స్వాభిమాని పక్ష పార్టీ తరపున దేవేంద్ర భుయార్ మోర్షి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. తెల్లవారుజామున భుయార్ తన కార్యకర్తలతో కలిసి కారులో వెళ్తుండగా బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయన వాహనంపై కాల్పులు జరిపారు.


కారును అడ్డగించి భుయార్ ను బయటకు లాగి ఆయనపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా భుయార్ వాహనానికి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో గాయపడిన భుయార్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయన హెల్త్ కండీషన్ బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని కాల్పులకు తెగబడిన దుండగుల కోసం గాలింపులు చేపడుతున్నారు. ఇక ఈ దాడిలో ముగ్గురు నిందితులు పాల్గొన్నట్లు తెలుస్తోంది..


ఇకపోతే హర్యానా,మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభమైన, సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే రెండు రాష్ట్రాలలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. మహారాష్ట్రలో 5గంటల వరకు  44శాతం ఓటింగ్ మాత్రమే నమోదవగా,హర్యానాలో 52శాతం నమోదైంది. ఇక ఈ ఎన్నికల్లో గెలిచి హర్యానాలో, మహారాష్ట్రలో మరోసారి అధికార పగ్గాలు చేపట్టేది తామేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా, కాంగ్రెస్ కూడా ఈ సారి తామే అధికారంలోకి రాబోతున్నామనే ధీమాతో ఉంది. అధికారం ఎవరి వశం అవుతుందో తెలియాలంటే అక్టోబర్-24, వరకు ఆగవలసిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: