తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన జగన్...మొన్న ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో జగన్ తొమ్మిదేళ్లు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినట్లైంది. వైసీపీ అధికారంలోకి రావడానికి నేతలు, కార్యకర్తలు కష్టం చాలా ఉంది. ఎన్ని అవాంతరాలు ఎదురైన వారు జగన్ కోసం నిలబడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఏ పార్టీ అయిన అధికారంలోకి వస్తే పార్టీని పెద్దగా పట్టించుకోదు. సీఎం గా ఉన్న వ్యక్తి ప్రభుత్వ వ్యవహారాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీని పట్టించుకునే సమయం దొరకదు.


అలా గతం ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు టీడీపీ కోసం కష్టపడిన కార్యకర్తలని, కొందరు ద్వితీయ శ్రేణి నేతలని పెద్దగా పట్టించుకోలేదు. వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. పార్టీ మారి వచ్చిన నేతలకు, కేడర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడానికి ఇదొక కారణమైంది. అయితే ఈ తప్పునీ ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి చేయడం లేదు. అనుభవం లేకపోయిన సరికొత్త నిర్ణయాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్ పార్టీకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు.


పాలన తొలిసారి అయిన ఐదు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు, సరికొత్త నిర్ణయాలు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నేతలకు, కార్యకర్తలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తున్నారు. ఇప్పటికే మంత్రి పదవులు దక్కని నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఇక మరిన్ని పదవులు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అటు సీనియర్ నేతలకు కూడా కీలక పదవులు ఇస్తున్నారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్లు, ఆలయ చైర్మన్లు, పాలక మండళ్ళలో నేతలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారు.


అటు కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలకు చిన్న చిన్న పదవులు ఇచ్చారు. అలాగే అర్హులైన కార్యకర్తలకు గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఇలా జగన్ అధికారంలోకి వచ్చిన పార్టీ కోసం కష్టపడిన నేతలు, కార్యకర్తలని మరిచిపోకుండా వారికి తగిన పదవులు ఇచ్చి గౌరవిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: