హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు పోలింగ్‌ ముగిసింది. ఒకటి రెండుచోట్ల ఈవీఎంలు మొరాయించినా నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల పరిధిలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఇకపోతే అధికార పార్టీ టీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలు హోరాహోరీగా ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో ముగ్గురు మహిళలు సహా 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.


ఇక హుజూర్‌నగర్‌,  చింతలపాలెం, మఠంపల్లి, మేళ్లచెరువు, పాలకవీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాల్లోని ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తం 302 పోలింగ్ కేంద్రాలు, 1708 ఈవీఎంలను వినియోగించారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.  82.23 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి ఉత్తమ్‌ పద్మావతి, టీడీపీ నుంచి చావా కిరణ్మయి, బీజేపీ నుంచి కోట రామారావు, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న బరిలో నిలిచారు. కాగా, ఈనెల 24న ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాన్ని వెల్లడిస్తారు.


ఇక  హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి…. శానంపూడి సైదిరెడ్డి పోలింగ్ బూత్ దగ్గర ఓవర్ యాక్షన్ చేశారు. నిబంధనలు పాటించాలని చెప్పిన పోలీసులకే ఉల్టా వార్నింగ్ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల చెరువు పోలింగ్ బూత్ సందర్శనకు వెళ్లిన సైదిరెడ్డి, లోకల్ లీడర్లతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా…  ఎస్సై అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన సైదిరెడ్డి…. ఓవర్ యాక్షన్ వద్దు….. ఏం హీరో అనుకుంటున్నావా.. అంటూ ఎస్సైకే వార్నింగ్ ఇచ్చారు.. ఇక ఈ సంఘటనపై తదుపరి చర్యలు ఏమైనా ఉన్నాయాలేవా అనేది తెలియవలసి  ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: