నేటి సమాజంలో అధికార పార్టీలో ఉన్న వారిని ప్రత్యర్థి పార్టీ వాళ్ళు విమర్శించడం సర్వ సాధారణం అయిపొయింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆంధ్ర ప్రదేశ్  సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై  విమర్శలు చేశారు.

ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న చంద్ర బాబు .. వైసీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం చెబుతున్న నవరత్నాలు నవగ్రహాలుగా మారిపోయాయని చంద్రబాబు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయటం ఏమిటి అని జగన్ పై  ఆగ్రహం వ్యక్తం చేసాడు బాబు.


ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి టీడీపీ నేతలపై వేధింపులు బాగా పెరిగాయి అని తెలిపారు .... పల్నాటి పులి కోడెలను అక్రమ కేసులు పెట్టి వేధించి చంపారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. మేము అభివృద్ధి రాజకీయం చేస్తే... జగన్‌ మాత్రం చిల్లర, రౌడీ రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు. ఇక  పార్టీలో యువతకు 33 శాతం, మహిళలకు 33 శాతం పదవులు ఇస్తామని చంద్రబాబు తెలియచేయడం జరిగింది. జగన్ సర్కార్ శాశ్వతం కాదని పోలీసులు గ్రహించాలని చంద్రబాబు కోరడం జరిగింది.

ఇది ఇలా ఉంటే జగన్ అన్న ప్రవేశ పెట్టిన పధకాలు అన్నిటికి కూడా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది రాష్ట్రంలో. మొదటగా నిరుద్యోగం నిర్ములనగా చాల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. పాద యాత్ర సమయంలో ఇచ్చిన హామీలు అన్ని ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తుంది జగన్ సర్కార్. అన్ని పధకాలు అన్ని విధాలుగా అందరు లబ్ది చెడుతున్నారు. జగన్ మాత్రం ప్రజల నుంచి మంచి ఆధారణ పోతున్నారు అనే చెప్పాలి. రోజు రోజుకి సరి కొత్త పథకాలతో ప్రజలను మాత్రం సంతోషంగా ఉంచుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: